మంచు మనోజ్ – మౌనిక వార‌స‌త్వంపై మోహ‌న్ బాబు షాకింగ్ కండీష‌న్..!

టాలీవుడ్ లో మంచు మోహన్ బాబు పేరు చెప్తే తెలియని వారు ఉండరు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు మోహన్ బాబు. అతడి కూతురు మంచు లక్ష్మి మొదటి ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చినా తరువాత కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా నటించింది. ఈమె యాంకర్ గా చేసిన షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మంచు లక్ష్మి కొంతకాలం క్రితం మంచు మనోజ్ పెళ్లిలో హడావిడి చేసింది.

మంచు మనోజ్ – భూమా మౌనిక పెళ్లి పెద్దై అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఒంటి చేత్తో చేసింది. తాజాగా వారిద్దరి వైవాహిక జీవితం గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోలేదని.. నేను వేదాద్రి గుడికి వెళ్లి దేవుడికి నమస్కరించి మా నాన్నను ఎలాగైనా ? ఒప్పించి వీళ్ళ పెళ్లి చేయమని కోరుకున్నానని.. ఏం జరిగిందో తెలియదు గానీ వెంటనే నాన్న పెళ్లికి ఒప్పుకున్నారని చెప్పింది.

అందుకే వీరిద్దరి పెళ్లి అయిన తర్వాత మళ్ళీ వేదాద్రి స్వామి దర్శనానికి తీసుకువెళ్లానని చెప్పుకొచ్చింది. అలాగే మనోజ్ – మౌనిక పిల్లలనుకనే విషయంపై కూడా స్పందిస్తూ మౌనిక చాలా చిన్న పిల్లని.. ఇంటి బాధ్యతలు ఏది ఆమెకు అప్పజెప్పలేదని కేవలం ఒక బిడ్డని క‌నివ్వ‌మ‌ని చెప్పామ‌ని చెప్పుకొచ్చింది.
మా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా నాకు ఇంకా చాలరు.. నా కూతురితో పాటు ఎప్పుడూ నలుగురు ఐదుగురు పిల్లలు మా ఇంట్లోనే ఉంటారని ల‌క్ష్మి చెప్పింది.

అయినా నాకు పిల్లలపై ఉన్న ఇష్టంతో కొన్ని స్కూల్స్ దత్తత కూడా తీసుకున్నా అంటూ చెప్పుకొచ్చింది. ఇక మోహన్ బాబు కూడా వీరిద్దరి వారసత్వంపై కండిషన్ పెట్టారని మౌనికకు ఇప్పటికే కొడుకు ఉన్నా మంచు మనోజ్ – మౌనికలు ఇద్దరు బిడ్డ‌ను కనివ్వాలని చెప్పార‌ట‌. మౌనిక‌కు ఇప్ప‌టికే ఉన్న బిడ్డ ఆమె మొద‌టి భ‌ర్త ద్వారా క‌లిగిన సంతానం. ఇప్పుడు మంచు వారసుడికి ఆమె జ‌న్మ‌నివ్వాల‌న్న‌దే మోహ‌న్‌బాబు పంతం. అందుకే మనోజ్ – మౌనిక ఈ కండిషన్‌ను ఒప్పుకొని మంచు వార‌సుడిని కనడానికి రెడీ అయ్యార‌ని వార్తలు వినిపిస్తున్నాయి.