గ‌ర్భం వ‌చ్చినా కూడా హీరోయిన్లుగా నటించిన స్టార్ న‌టీమ‌ణులు వీళ్లే…!

ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్లు తమ గర్భవతిగా ఉన్న సమయంలో శరీరం మార్పులు వచ్చిన కష్టపడి ఫ్లైట్ జర్నీలు చేసి షూటింగ్‌ల‌లో పాల్గొని సినిమాల్లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రెగ్నెన్సీ టైంలో కూడా సినిమాల్లో నటించి అలరించిన స్టార్ హీరోయిన్లు ఎవరో ఒకసారి తెలుసుకుందాం.

అలియా భట్ :
బాలీవుడ్ స్టార్ హీరోని ఆలియా భట్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ మ‌ర‌ద‌లుగా నటించిన ఆలియా.. ” హార్ట్ ఆఫ్ స్టోన్ ” లో నటించింది. ఈ సినిమా తో హాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆలియా తన తొలి హాలీవుడ్ సినిమా షూటింగ్ టైంలో ప్రెగ్నెంట్ గా ఉందని వెల్లడించింది. అంతేకాదు బ్రహ్మాస్త్ర విడుదలకు కూడా ప్రచార కార్యక్రమాలకు పాల్గొంది అలియా భట్. ప్రమోషన్స్ షెడ్యూల్ సమయంలో ఆలియా బేబీ బంప్ తో కనిపించడం మనమందరం చూసాం.

కరీనా కపూర్ ఖాన్ :
కరీనాకపూర్ ఖాన్ అందాన్ని మాటల్లో వర్ణించలేం. పెళై ఇద్దరు పిల్లలు పుట్టినా ఆమె స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణిస్తుందంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో స్ప‌ష్ట‌మవుతోంది. కరీనా కూడా బేబీ బంప్‌తో షూటింగ్‌కి వెళ్లేందుకు అసలు వెనుకాడ లేదు. తన రెండో బిడ్డ జహంగీర్ అలీఖాన్ గర్భంలో ఉన్నప్పుడు ” లాల్ సింగ్ చద్దా ” సినిమ షూటింగ్ కొనసాగించింది. లాక్ మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంపై బేబీ బంప్‌తో తన షో ప్రదర్శించింది.

కాజోల్ :
కరణ్ జోహార్ ” విఆర్ ఫ్యామిలీ ” మూవీ షూటింగ్ టైంలో కాజోల్ రెండోసారి గర్భవతిగా ఉంది. దాంతో ఈ సినిమాలో లెట్స్ రాక్ అనే పాటకు డ్యాన్స్ స్టెప్పులు కష్టంగా భావించి తప్పుకుంది. కరణ్ జోహార్ తన ఇబ్బందిని గ్రహించి స్టెప్స్ మార్చమని కొరియోగ్రాఫర్ కి చెప్పడంతో మొత్తానికి ఆ పాటలో కూడా డాన్స్ చేసింది కాజోల్. కాగా ఈ సినిమా విడుదలైన మూడు రోజులకి కాజల్ యుగ్‌కి జన్మనిచ్చింది. ప్రసూతి సెలవులు తీసుకునే ముందు ” టూన్ పూర్ కా సూపర్ హీరో ” షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.

శ్రీదేవి :
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ బాలీవుడ్ ఫిలిం ఎగ్జిక్యూటివ్ లను చాలా బాధ పెట్టింది. అప్పటికే ” జుదాయి ” షూటింగ్ ఇంకా మిగిలి ఉంది. అయితే తన ఒప్పందాలు కట్టుబాట్లకు లోబడి ప్రెగ్నెన్సీ టైంలో కూడా శ్రీదేవి ఈ సినిమాలో న‌టించింది. జాన్వి కపూర్ పుట్టిన తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రీదేవి తరువాత ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది.

జుహీ చావ్లా :
జుహీ చావ్లా సూపర్ హిట్ మూవీ అయిన ఖయామత్ సే ఖయామత్, తక్, ఇష్క్ సినిమాలలో హీరోయిన్గా నటించి కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ” అమ్జాని అత్తాని ఖర్చ రూపయ్య ” సినిమా షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు జూహి గర్భవతిగా ఉంది. ” ఝుంకార బీట్స్ ” లో నటించే సమయంలో రెండో బిడ్డతో ఏడు నెలల గర్భవతిగా ఉంది.

ఐశ్వర్యరాయ్ :
ఒకప్పటి ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ కూడా రజనీకాంత్ తో నటించిన ” రోబో ” సినిమా టైంలో గర్భవతిగా షూటింగ్‌లో పాల్గొంది.