టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ అంటే అన్ని రకాల సినిమాలు చేసిన గొప్ప నటుడిగా ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో ఆయన ఇట్టే ఒదిగిపోయారు. ఇతరులను గౌరవించడంలో, క్రమశిక్షణగా ఉండడంలో తన వారసులకు కూడా బాగా నేర్పించారు. దానినే ప్రస్తుత తరంలోని నందమూరి హీరోలు అలవర్చుకున్నారు.
బాలయ్య ఎంత సరాదాగా ఉంటారో అంతే క్రమశిక్షణగా ఉంటారు. అది తన తండ్రి ఎన్టీఆర్ తమకిచ్చిన ఆస్తిగా చెబుతుంటారు. ఆ తర్వాత తరంలోని జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా బయట చాలా సరదాగా ఉంటారు. అంతేకాకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుతారు. ఈ ఇద్దరూ దివంగత నందమూరి హరికృష్ణ కొడుకులు. వీరిద్దరి మధ్య అనుబంధం చూస్తే ఇతరులు కుళ్లుకుంటారు. ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఈ సోదరులిద్దరూ కలిసి మెలిసి ఉంటారు. వీరికి సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం బయటకు వచ్చింది.
కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఒకరి సినిమాలకు మరొకరు గెస్ట్‌లుగా వస్తుంటారు. వీరిలో ఒకరు ఏదైనా సినిమా చేస్తుంటే మరొకరు కథ విషయంలో ఇతర విషయాల్లోనూ అభిప్రాయాలు పంచుకుంటుంటారు. ఒకరిని మరొకరు గౌరవించుకుంటారు. ఇక కళ్యాణ్ రామ్‌ని ఎన్టీఆర్ అన్నయ్య అని సంబోధిస్తుంటాడు. అయితే కళ్యాణ్ రామ్ మాత్రం తన తమ్ముడిని తమ్ముడు అని పిలవడు. జూనియర్ ఎన్టీఆర్‌ని కళ్యాణ్ రామ్ నాన్న అని పిలుస్తుంటాడు.
దీనికి ఓ కారణం ఉంది. తన తమ్ముడిలో తాను తన నాన్నని చూస్తుంటానని, అందుకే అలా పిలుస్తుంటానని కళ్యాణ్ రామ్ ఓ సందర్భంలో చెప్పారు. వీరి మధ్య ఇంత అనుబంధం ఉందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇతరులు ఏమనుకుంటారో అని వీరు పట్టించుకోరు. తమ మధ్య సోదర బంధాన్ని మరింత పెంచుకుంటున్నారు.
ఇక ఎన్టీఆర్ అయితే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు గెస్ట్‌గా వచ్చారు. ఆ సమయంలో తన అన్న నటించిన ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని బల్లగుద్ది చెప్పారు. ఆయన జడ్జిమెంట్ నిజమైంది. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇలా ఈ అన్నదమ్ములిద్దరూ ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా తమ పయనం సాగిస్తున్నారు.