టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన రంగబలి సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు వచ్చిన టాక్ కాస్త నిరాశ పరిచేలా ఉంది. ఈ సినిమా సక్సెస్ మీట్లో నాగశౌర్య కాస్త ఫీల్ అయినట్టుగా తెలుస్తోంది. సక్సెస్ మీట్లో ఓ ప్రెస్మీట్లో భాగంగా శౌర్య విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు గట్టిగానే సమాధానాలు ఇచ్చారు.
రంగబలి విషయంలో వచ్చిన టాక్, వెబ్ మీడియా ఇచ్చిన సమీక్షలు ఇవన్నీ కలిసి శౌర్య ను కాస్త బాధపెట్టినట్లు కనిపిస్తోంది. అయితే విలేకర్లు అడిగిన ప్రశ్నలకు మాత్రం శౌర్య ఎక్కడా తడబాటు లేకుండానే ఆన్సర్లు చేశాడు. కొన్ని చోట్ల అయితే నాగశౌర్య సమాధానాలకు మీడియా నుంచి ఎదురు ప్రశ్నలు లేకుండాపోయాయి.
మహేష్ బాబు మాస్ సినిమా ప్లాప్ అయితే మళ్లీ మాస్ సినిమా చేయవద్దని మీరు చెపుతారా ? అని శౌర్య ఎదురు ప్రశ్న వేశాడు. 80 శాతం సినిమా బాగుండి… 20 శాతం బాగోలేదన్నప్పుడు ఆ 80 శాతం ఎంజాయ్ చేయాలి కదా ? అని చెప్పాడు. ఇక తాము ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదని, స్పూఫ్ ఇంటర్వూ ఎవరి క్యారెక్టర్లతో అయితే చేశామో వాళ్లంతా బాగానే ఎంజాయ్ చేశారని చెప్పాడు.
ఇక సినిమాల్లో తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉంటామని.. సక్సెస్ అయినప్పుడు కూడా మళ్లీ మీరే రాస్తారని చెప్పాడు. ఇక రంగబలి విషయంలో మీడియా స్పందన కాస్త నెగటివ్ గా ఉన్నా కూడా శౌర్య సంయమనం కోల్పోకుండా జాగ్రత్తగా సమాధానాలు చెప్పాడు. అయితే రంగబలి టాక్ ప్రచారంపై మనోడు
కాస్త ఫీలయినట్లే కనిపిస్తోంది.