‘ తొలిప్రేమ ‘ – ‘ మాస్ట‌ర్ ‘ సినిమాల మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవా ప‌రిస్థితి చూస్తే క‌న్నీళ్లు ఆగ‌వ్‌…!

టాలీవుడ్ లో ఆల్‌టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీల‌లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ” తొలిప్రేమ ” మూవీ ఒకటి. ఏ కరుణాకరన్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. అప్పటి వరకు చిరంజీవి తమ్ముడిగా కొనసాగిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో యూత్ ఐకాన్ గా మారి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కరుణాకర్ టేకింగ్, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ తోపాటు.. తమిళ సంగీత దర్శకుడు ” దేవా ” అందించిన మ్యూజిక్ కూడా ఒక కారణం.

ఈ సినిమాలో పాటలు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే మనసుకి ఇప్ప‌ట‌కీ కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. రీసెంట్ గా మరోసారి థియేటర్స్ లో రీ రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాని వెండి తెర మీద చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు బ్యాక్గ్రౌండ్ సంగీతానికి క‌నెక్ట్ అయిపోతాడు. అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు దేవా.

దేవా అంత‌కు ముందు ప‌వ‌న్ అన్న చిరు న‌టించిన మాస్ట‌ర్ సినిమాకు కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. ఇక‌ ప్రస్తుతం దేవా ఎక్కడ ఉన్నారు ? ఏం చేస్తున్నారు ? అనేది చూస్తే కాస్త బాధాక‌ర‌మే అవుతుంది. తమిళనాడులో సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవా. అక్కడ స్టార్ హీరోలు అందరి సినిమాలకు మ్యూజిక్ అందించాడు. సంగీతమే ప్రపంచంగా బతికిన దేవా ఆస్కార్ అవార్డు విన్నర్. చంద్రబోస్ కి మంచి స్నేహితుడు.

వీరిద్దరూ టీనేజ్ లో ఉన్న సమయంలో ఎన్నో స్టేజ్ షోలో కలిసి పాల్గొన్నారు. 1986లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దేవా.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూడా కలిసి పనిచేశారు. ఆయనకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించాడు దేవా. తమిళనాడుని ఒక ఊపు ఊపేసిన పాటల్లో 90 శాతం పాటలను దేవానే అందించాడు. దేవా కొడుకు శ్రీకాంత్ దేవా కూడా ప్రస్తుతం తమిళనాడులో మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు.

దేవా అక్క కొడుకు జై టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో. ప్ర‌స్తుతం దేవాతో సమానమైన వయసు ఉన్న ఇళయరాజా, కీరవాణి ఇప్పటికీ సంగీత దర్శకత్వం వహిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు. ఒకప్పుడు స్టార్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా వెలుగు వెలిగిన దేవా మాత్రం తన చేతిలో ఒక్క సినిమా ప్రాజెక్ట్ కూడా లేకపోవడంతో ఖాళీగా జీవితాన్ని గడుపుతున్నాడు. కొడుకు కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో వీరు ఆర్థికంగా కూడా వెనుకబడినట్టు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దేవా పరిస్థితి తెలిసిన ఫ్యాన్స్ చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.