మాజీ భార్యభర్తలు నాగచైతన్య, సమంత ఇద్దరి సినీ కెరర్ చాలా ఘోరంగా అంటే ఘోరంగా సాగుతోంది. తాజాగా శాకుంతలం సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో సమంత సినిమాలకు యేడాది పాటు దూరంగా ఉండబోతోందన్న వార్తలు కూడా వచ్చాయి. అంటే సమంత ఇప్పట్లో ఇక సినిమాలలో నటించదు. ఇక విజయ్ దేవరకొండకు ఆమె జోడీగా నటిస్తోన్న ఖుషి సినిమా కూడా కేవలం సమంత వల్లే బజ్ లేదంటున్నారు.
ఇదిలా ఉంటే అటు వైపు వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతోన్న సమంత మాజీ భర్త చైతన్య ఎట్టకేలకు తన కొత్త సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. గీతా పతాకంపై నాగ్ చైతన్య-చందు మొండేటి కాంబినేషన్ నిర్మించబోయే సినిమాకు సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ సినిమాపై ఈ నెలలో అనౌన్స్ మెంట్ ఉంటుందంటున్నారు. ఈ సినిమా కథ కాస్త భారీగా ఉంటుందని… కథ అంతా సముద్రం నేపథ్యంలోని ప్రేమకథ ఇది అని తెలుస్తోంది.
గతంలో గుజరాత్ సముద్ర తీరం నేపథ్యంలో ఈ ప్రేమకథ ఉందని పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్‌ను ఏపీలోని శ్రీకాకుళం సముద్రతీరం నేపథ్యంలోకి మార్చేశారట. సినిమాలో చైతన్య ఫిషర్ మెన్ అని.. కథ ఇండియా, పాకిస్తాన్ సముద్ర తీర నేపథ్యంలో ఉంటుందంటున్నారు. లవ్ స్టోరీగానే కాకుండా.. ఎమోషనల్ లవ్‌స్టోరీగా దర్శకుడు చందు కథను రాసుకున్నట్టు తెలిసింది.
ఉప్పెన, సీతారామ్ స్టైల్లో కథ ఉంటుందంటున్నారు. ఏదేమైనా అటు తన మాజీ భార్య సమంత శాకుంతలం లాంటి డిజాస్టర్ దెబ్బతో అసలు సినిమాలు చేయనని షాకింగ్ డెసిషన్ తీసుకుంటే.. ఇటు వరుస ప్లాపులతో ఉన్న చైతు ఎట్టకేలకు ఓ హిట్ డైరెక్టర్‌తో సరికొత్త కథతో తెరకెక్కే సినిమాలో నటించనున్నాడు.