ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, డివోర్స్ తీసుకోవడం చాలా కామన్ గా మారిపోయింది. కొంతమంది నటీ, నటులు మాత్రం దీనికి భిన్నంగా 50 ఏళ్ళు వయస్సు వచ్చినప్పటికీ ఎవరిని వివాహం చేసుకోకుండా ఒంటరిగానే గడుపుతున్నారు. అలా 50 ఏళ్లు పైబడిన ఇంకా వివాహం చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తున్న హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం.
టబు :
టాలీవుడ్‌లో అందరి అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న టబు టాలీవుడ్ లోనే కాక హాలీవుడ్, బాలీవుడ్ లోనూ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. ఇప్పటికి నటిస్తున్న టబ్బు తన వయసు 50 ఏళ్లు దాటుతున్నా ఇంకా వివాహం చేసుకోలేదు.
సుస్మితాసేన్ :
ఒకప్పుడు టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన సుస్మిత.. స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కూడా వయసు 50 సంవత్సరాలు దాటినా ఇంకా వివాహం చేసుకోలేదు.
శోభన :
విక్రమ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభన ఎన్నో సినిమాల్లో తన నటనతో పాటు డ్యాన్స్ లో కూడా సత్తా చాటింది. నాట్యం, డ్యాన్స్‌లో మంచి పేరు సంపాదించుకున్న శోభన తన వయసు 50 సంవత్సరాలు దాటినా ఇంకా వివాహం చేసుకోలేదు.
దివ్య దత్త :
బాలీవుడ్ యాక్టర్స్ దివ్య దత్త కూడా వయసు 50 దగ్గరకు వస్తున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. కారణం అడగగా సరైన వ్యక్తి దొరకలేదంటూ దొరికితే వివాహం చేసుకుంటానంటూ సమాధానం చెప్పింది.
అమీషా పటేల్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమీషా పటేల్ కూడా ఇంకా వివాహం చేసుకోలేదు. 55 ఏళ్లు దాటుతున్నా ఇంకా ఒంటరిగానే జీవిస్తుంది.
నగ్మా :
చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో హిట్ సినిమాలలో హీరోయిన్‌గా నటించిన నగ్మా కూడా 50 ఏళ్లు వయసు పైబడినప్పటికీ ఒంటరిగానే జీవితాన్ని గడుపుతుంది. వీరితో పాటు యాక్ట్రెస్ సితార కూడా ఇంకా వివాహం చేసుకోలేదు.