ధోనీ – దీపికా ప‌దుకొణే ప్రేమ ఫెయిల్ అయ్యేలా చేసిన స్టార్ క్రికెట‌ర్‌… సినిమాను మించిన స్టోరీ..!

ఇండస్ట్రీలో ఒకరినొకరు ప్రేమించుకుని మరొకరితో క్లోజ్ గా ఉంటూ.. షికార్లు కొట్టడం చాలా సహజంగా మారిపోయింది. వీటిని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా అంతగా పట్టించుకోరు. గతంలో ఇలాంటి సంఘటన ఇద్దరు ప్రేమికులను విడదీసింది. 2007లో స్టార్ క్రికెటర్ ధోని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారట.

వీరిద్దరూ ఎక్కడపడితే అక్కడ చెట్టప‌ట్టాలు వేసుకుని తిరిగే వారని అప్పట్లో నేష‌న‌ల్ మీడియా హాట్‌టాపిక్‌. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటాన‌ని అందరూ భావించారు. అయితే ఎవరూ అనుకోని విధంగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. వీరి ప్రేమ బ్రేకప్ అవ్వడానికి మరెవరో కారణం కాదట.. ధోని బెస్ట్ ఫ్రెండ్ అయిన మ‌రో మాజీ స్టార్ క్రికెట‌ర్‌ యువరాజ్ సింగ్.

ధోని – దీపిక పదుకొనే ఇద్దరు ప్రేమలో ఉన్న టైంలో ధోనీ క్లోజ్ ఫ్రెండ్ యువరాజ్ సింగ్ తో కూడా దీపిక చనువుగా ఉండేదట. కానీ ధోని వీరిని ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకోలేదట. దీపికా, యువరాజ్ సింగ్‌తో సీక్రెట్ గా పార్టీలకి, పబ్ల‌కి, టూర్లకి వెళ్లడం కూడా చేసిందట. ఈ విషయం తెలిసిన ధోని వాళ్ళిద్దర్నీ స్నేహితులలాగే చూసేవాడట. ఓ సారి యువరాజ్ సింగ్‌ని దీపిక పదుకొనే కిస్ చేసిన ఫోటో మీడియాలో వైరల్ అవ్వడంతో ధోని గుండె పగిలేనంత పని అయిందట.

స్నేహితులుగా ఉన్నట్టు నటిస్తూనే ఇటు ప్రియురాలు దీపిక.. అటు ఫ్రెండ్ యువరాజ్ సింగ్ ఇద్ద‌రు ఇచ్చిన షాక్‌తో ఎంతగానో బాధపడ్డాడట ధోని. అప్పటినుంచి ధోని – దీపిక పదుకొనేకి బ్రేకప్ చెప్పి తన దారి తాను చూసుకున్నాడు. ఆ త‌ర్వాత రాయ్‌ల‌క్ష్మితో మ‌నోడు ప్రేమ‌లో ప‌డ్డాడంటారు. దీనిని దీపికా లైట్ తీసుకుని తన సినిమాలో తను బిజీ అయిపోయిందట. అప్పట్లో వీరిద్దరూ విడిపోవడానికి కారణం యువరాజ్ సింగ్‌ అంటూ మీడియాలో అనేక వార్తలు వైరల్ అయ్యాయి.