మృణాల్ ఠాకూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ప్రస్తుతం నాని 30 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందట. కాగా ఈ రెండు సినిమాలకు రూ. కోటి కంటే తక్కువ రెమ్యూనరేషన్ అందుకుంది మృణాల్.
తాజాగా విజయ్ దేవరకొండ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మృణాల్ ఈ సినిమాకి రూ.కోటి పైన చార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు తాజాగా మరో యంగ్ హీరో సినిమాలో హీరోయిన్గా నటించమని నిర్మాతలు అడగగా రూ.2 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని.. వారు రూ కోటిన్నర మాత్రమే రెమ్యూనరేషన్ ఇచ్చుకోగలమని చెప్పడంతో కరాకండిగా నో చెప్పేసిందని టాక్.
మృణాల్ తాజాగా బాలీవుడ్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని సందర్భాలలో సె…* గురించి పబ్లిక్ గా కామెంట్స్ చేయడంతో ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అయ్యాయి. ఈ సిరీస్‌కి మంచి గుర్తింపు రావడంతో బాలీవుడ్ లో కూడా మృణాల్‌కి అవకాశాలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్ లో మరో వెబ్ సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అవసరం అయితే కాస్త ఎక్కువుగానే చూపిస్తా… రేటు విషయంలో మాత్రం వెనక్కు తగ్గనని తెగేసే చెపుతోందట అమ్మడు.