ఇటీవల మృతిచెందిన దివంగత రాకేష్ మాస్టర్ జీవితం చివర్లో పెద్ద సంచలనాలకు కేరాఫ్ అయ్యింది. రాకేష్ మాస్టర్ వరుసగా యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ కాంట్రవర్సీగా మారారు. అనారోగ్య కారణంతో ఆయన అకాల మరణం చెందారు. ఇదిలా ఉంటే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన లక్ష్మి అనే మహిళ రాకేష్ మాస్టర్ మూడో భార్యగా చలామణి అయ్యింది.
రాకేష్ మాస్టర్ దగ్గర వంట మనిషిగా చేరిన లక్ష్మిని ఆయన చేరదీశాడని అంటారు. ఇక లక్ష్మిని రాకేష్ మాస్టర్ అమ్మా అని పిలుస్తూ తన ఇంట్లోనే ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఆమె ఆలనాపాలనా చూసుకుంటూ పలు వీడియోలు చేశారు. వీరిద్దరు కలిసి చాలా ఇంటర్వ్యూలలో పాలొన్నారు. అనంతరం వీరి మధ్య విబేధాలు తలెత్తడంతో మాస్టర్ మరణానికి కొద్ది నెలల ముందే విడిపోయారు.
ఆ తర్వాత ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు. తాజాగా లక్ష్మిపై దాడి జరిగింది. నడిరోడ్డు మీదే ఐదుగురు మహిళలు ఆమెను నడిరోడ్డు మీద చితక్కొట్టారు. ఈ దాడిలో లక్ష్మికి తీవ్ర గాయాలు కాగా ఆమె తనపై జరిగిన దాడి గురించి హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం లక్ష్మి మాట్లాడుతూ పెరుగు పెద్దమ్మ, దుర్గ. లల్లీ, నెల్లూరు భారతి ఈ దాడి చేశారని చెప్పారు.
తాను యూట్యూబ్‌లో ఫేమస్ అని.. తనను యూట్యూబ్ నుంచి వెళ్లిపొమ్మంటూ ఈ దాడి జరిగిందని లక్ష్మి చెప్పింది. లక్ష్మిపై దాడి చేసిన వారిలో ఒకరు అయిన లల్లి మాట్లాడుతూ తన కుమార్తెపై లక్ష్మి అనుచిత కామెంట్లు చేసిందని.. ఆమె స్కూల్‌కు వెళ్లడం కూడా మానేసినందునే ఈ దాడి చేశామని.. అంతేకాని యూట్యూబ్ వదిలి పోవాలని కాదని లల్లీ చెప్పుకొచ్చారు. లల్లీ కూడా లక్ష్మి మీద ఫిర్యాదు చేశారట.
మరో టాక్ ఏంటంటే రాకేష్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మి స్వాధీనం చేసుకున్నారని…ఆ ఛానల్ విషయంలో లక్ష్మికి లల్లీ వర్గానికి గొడవలు జరుగుతున్నాయట.