పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు ప్రత్యేకమైన పరిశ్రమ అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న పవర్ స్టార్ అటు రాజకీయాల్లోను బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాల్లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ హర హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, బ్రో సినిమాలలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్స్ ఎప్పుడో మొదలయ్యాయి. వీటిలో ఓ రెండు సినిమాలు ఆగిపోతున్నాయట.
పవన్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉండడంతో వారాహి యాత్రలకు సమయం చాలటం లేదనే ఉద్దేశంతో రెండు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడట. హరి శంకర్ దర్శకత్వంలో వస్తున్న ” ఉస్తాద్ భగత్” సింగ్ ఇప్పటివరకు కేవలం 8 శాతం షూటింగ్ మాత్రమే జరుపుకుందని తెలుస్తుంది. అలాగే హరీష్ శంకర్ కి మామూలుగానే ఓవరాక్షన్ ఎక్కువని.. దీంతో పవన్ కళ్యాణ్ సినిమా ఛాన్స్ దొరకడంతో అప్పట్లో మరింతగా మితిమీరి ప్రవర్తించాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ” ఉస్తాద్ భగత్ సింగ్ ” మొదటగా ఆపేసాడట. దీంతో ఇప్పుడు హరీష్ శంకర్ లబోదిబో అంటూ ఏం ? చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడట. ఈ సినిమాతో పాటు 50% మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు సినిమాకి కూడా కాస్త బ్రేక్ ఇచ్చాడు. 2014 ఎన్నికల తర్వాత ఈ సినిమా షూటింగ్ కొనసాగిపోతుందని సమాచారం. ఇప్పట్లో అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించిన అవకాశం లేదు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ” ఓజి “, సముద్రఖణి దర్శకత్వంలో వస్తున్న ” బ్రో..ది అవతార్ ” సినిమాలు మాత్రమే పూర్తి చేస్తాడట.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ” బ్రో ” ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్ టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. 2014 ఎన్నికల తర్వాత సముద్రఖని దర్శకత్వంలోనే పవర్ స్టార్ మరో సినిమాలో నటించబోతున్నారని సమాచారం. ఈ సినిమా ఏ హీరోతో మల్టీస్టారర్, రీమేక్ కాకుండా కొత్త కథను సముద్రఖని రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఉస్తాద్ భగత్‌సింగ్ విషయంలో హరీష్‌శంకర్ ఈ సినిమా వదల్లేడు.. మరో సినిమా మొదలెట్టలేడన్నట్టుగా కుడితిలో పడ్డాడు.