“ బొమ్మరిల్లు ” సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్‌…!

హీరో సిద్ధార్థ్ ‘బాయ్స్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన సిద్ధార్థ్‌ కెరియర్ లో ” బొమ్మరిల్లు ” సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ తర్వాత చాలా సినిమాల్లో నటించినా ఊహించని స్థాయిలో సక్సెస్ రాలేదు. బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్‌గా జెనీలియా నటించింది. ఈ సినిమాలో వీరిద్దరిని తప్ప హీరో, హీరోయిన్లుగా వీరిని తప్ప మరి ఎవరిని ఊహించుకోలేనంతగా సినిమాకి కనెక్ట్ అయిపోయారు జనం.

ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తలో ” అంతేనా.. ఇంకేం కావాలి..? వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ.. ” డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. చాలామంది కాలర్ ట్యూన్ గా కూడా ఈ డైలాగులు ఉపయోగించేవారు. ఈ సినిమాతో డైరెక్టర్ భాస్కర్ కి కూడా బొమ్మరిల్లు భాస్కర్ అనే పేరు ఫిక్స్ అయిపోయింది. ఇంతకీ ఈ సినిమాకి బొమ్మరిల్లు అని టైటిల్ ఎలా? వచ్చిందో ఒకసారి చూద్దాం.

సుకుమార్ డైరెక్షన్‌లో ఆర్య సినిమా షూటింగ్ టైంలో భాస్కర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆర్య షూటింగ్ టైంలో భాస్కర్ పనితనం నచ్చిన దిల్ రాజు ఒక కథను సిద్ధం చేసుకో.. నేను నీకు ద‌ర్శ‌కుడిగా అవకాశం ఇస్తాను అని చెప్పాడట. భద్ర సినిమా తర్వాత భాస్కర్.. దిల్ రాజుకి స్టోరీ లైన్ వినిపించగా ఆ స్టోరీ దిల్ రాజుకు బాగా నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పేసాడట. ఈ సినిమాకు హీరోగా ముందుగా అల్లు అర్జున్, ఎన్టీఆర్ ను అడగగా వాళ్ళు ఇంత క్లాస్ క‌థ‌లో సెట్ అవ్వ‌మ‌న్న సందేహంతో రిజెక్ట్ చేశార‌ట‌.

దాంతో సిద్ధార్థ్‌ని ఈ సినిమాకు హీరోగా ఫిక్స్ చేశారు. హ్యాపీ సినిమాలో జెనీలియాని చూసిన భాస్కర్ ఈ సినిమాకు ఆమె బాగా సెట్ అవుతుందని హీరోయిన్‌గా ఫిక్స్ చేసాడు. ఇక షూటింగ్ కి అన్ని సిద్ధమైన తర్వాత టైటిల్ ఏం పెట్టాలని ఆలోచిస్తున్న దిల్ రాజుకు వై.వి.ఎస్ చౌదరి ఇచ్చిన ఓ ఇన్విటేష‌న్ భాస్క‌ర్ కంట ప‌డింద‌ట‌. అందులో కార్డు పై బొమ్మరిల్లు అనే పేరు చూసి ఇదే తన సినిమా టైటిల్ గా ఫిక్స్ చేశారట.