గతంలో మన తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ హిట్ అయిన పాత సినిమాలు రీ రిలీజ్ అనేవి ఎక్కువగా ఉండేవి.. కానీ శాటిలైట్, డిజిటల్ ఎంట్రీతో ఆ ట్రెండ్ తగ్గింది. కానీ తాజాగా గత కొన్ని రోజులుగా తెలుగులో పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ మళ్ళీ మొదలైంది. ఈ రీసెంట్ టైమ్స్ లో స్టార్ హీరోల సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను రీమాస్టర్ చేసి 4k లో మరోసారి విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే తెలుగులో పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, బిల్లా సింహాద్రి, చెన్నకేశవరెడ్డి, తొలిప్రేమ వంటి సినిమాలు రిలీజై మంచి కలెక్షను సాధించాయి. వాటిలో రీ రిలీజ్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలు ఏమిటో ఒకసారి చూద్దాం.
ముందుగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఖుషీ’ రీరిలీజ్‌లో మంచి వసూళ్లనే సాధించింది. ఈ సినిమా రూ. 7.46 కోట్ల గ్రాస్ వసూళ్లతో రీ రిలీజ్ మూవీస్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహాద్రి’ మూవీ కూడా రీ రిలీజ్‌లో సినిమాలో ఏకంగా రూ. 4.60 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఈ నగారానికి ఏమైంది ? విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈసినిమా కూడా రీ రిలీజ్‌లో రూ. 3.40 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్-3లోకి నిలిచ్చింది. రామ్ చరణ్, జెనీలియా జంటగా తెరకెక్కిన ‘ఆరెంజ్’. ఈ సినిమా కూడా రీ రిలీజ్‌లో రూ. 3.36 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన మూవీ ‘జల్సా’. ఈ సినిమా రీ రిలీజ్‌లో రూ. 3.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఒక్కడు’. రూ. 2.54 కోట్ల గ్రాస్ వసూళ్లను.. పోకిరి రూ. 1.73 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. అల్లు అర్జున్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేశముదురు’ రీ రిలీజ్‌లో రూ. 1.65 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. పవన్ కళ్యాణ్‌ను స్టార్‌గా మార్చిన సినిమా ‘తొలిప్రేమ’. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రీ రిలీజ్‌లో రూ. 1.32 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
బాలకృష్ణ తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘చెన్నెకేశవరెడ్డి’. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రీ రిలీజ్‌లో రూ. 1.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన ‘బిల్లా’ మూవీ రీ రిలీజ్‌లో రూ. 1.05 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఇలా టాలీవుడ్‌లో వచ్చిన రీ రిలీజ్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా టాప్ ప్లేస్ లో నిలిచింది.