పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు గత కొద్ది నెలల నుంచి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసిన వేళ రానే వచ్చింది. రీసెంట్గా సలార్ టీజర్ బయటికి వచ్చింది. కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగాదూర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.
అయితే రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ ప్రస్తుతం యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అంతే కాకుండా ఈ సినిమాను రెండు భాగాలుగా వస్తోందని కూడా ప్రకటించారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఎంతో ఇంటెన్సుగా సాగిన టీజర్ లో ప్రభాస్ లుక్ సరిగా రివీల్ చేయలేదు కానీ, ప్రభాస్ క్యారెక్టర్ ని జురాసిక్ పార్క్ లో డైనోసార్ తో కంపేర్ చేయడం ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఇదే సమయంలో ఈ టీజర్ లో హీరో గురించి ఒక రేంజ్లో ఎలివేషన్ ఇచ్చిన నటుడు ప్రస్తుతం ఇప్పుడు తెగ వైరల్ గా మారాడు..
ఆ నటుడు ఈ టీజర్ లో సింహ, చిరుత ,పులి, జురాసిక్ పార్క్ , డైనోసార్ అంటూ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ మొదలవుతుంది అలా చెప్పిన వ్యక్తి మరెవరో కాదు.. సీనియర్ నటుడు టిను ఆనంద్. ఈ సీనియర్ నటుడు ఇప్పటికే ప్రభాస్ తో సాహో సినిమాలో నటించాడు. మరోసారి ఈ సలార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఆనంద్ గతంలోని ఎన్నో తెలుగు సినిమాల్లో నటించాడు. ఆయన నటించిన సినిమాల్లో ప్రధానంగా బాలయ్య ఆదిత్య 369 లో సైంటిస్ట్ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది.
చిరంజీవి నటించిన అంజి సినిమాలో విలన్ భాటియా పాత్ర కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించారు ఆనంద్. అలాగే గత సంవత్సరం ఎంతో సూపర్ హిట్గా నిలిచిన సీతారామం సినిమాలో కూడా ఈయన నటించారు. ఇక ఆనంద్ ఫ్యామిలీ కూడా పూర్తిగా చిత్ర పరిశ్రమకు చెందినవారే.. ఈయన మేనల్లుడు సిద్ధార్థ ఆనంద్ కూడా బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.
ఆనంద్ తన కెరీర్ లో ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు. ఇప్పుడు సలార్ సినిమాలో కూడా ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఆ పాత్రను ఎంతో అద్భుతంగా తెరకెక్కించి ఉంటారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరి ఈ సినిమాలో ఆనంద్ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.