ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోల చిన్నప్పటి ఫోటోలు ఎంతో వైరల్ గా మారుతున్నాయి. త్రో బ్యాక్ ట్రెండ్ పేరుతో చిన్నప్పటి ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పై ఫోటోను చూశారు కదా..? ఇక అందులో ఉన్న బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ లోనే ఓ స్టార్ హీరో.. నందమూరి కుటుంబం నుంచి హీరోగా అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు.
అంతేకాకుండా రీసెంట్ గానే ఓ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వరస వైవిధ్యమైన సినిమాలకు కమిట్ అవుతూ దూసుకుపోతున్నాడు. అంతేకాకుండా ఈ హీరోకి టాలీవుడ్ లోనే ఓ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు నందమూరి కళ్యాణ్ రామ్. దివంగత నటుడు హరికృష్ణ పెద్ద కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు.
2003లో తొలిచూపులోనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. తర్వాత అదే సంవత్సరం అభిమన్యు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నాడు. ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా తాను ఏంటో నిరూపించుకున్నాడు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ తన చిన్నతనంతోనే బాబయ్ బాలకృష్ణ హీరోగా వచ్చిన బాలగోపాలుడు సినిమాలో బాలయ్యకు కొడుకు పాత్రలో నటించాడు.
అంతేకాకుండా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌తో పాటు మరో నటి రాశి కూడా బాలనటిగా నటించింది. ఇక వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించారు. అందునా అన్నాచెల్లెళ్లుగా నటించారు. బాలయ్య ,సుహాసిని నటించిన ఈ సినిమా కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చింది. గత ఏడాది బింబిసారా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీలో నటిస్తున్నారు.