ప్రస్తుతం చిత్ర పరిశ్రమంలో ట్రెండ్ మారిపోయింది. ఎన్నో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు కూడా ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్లుగా మిగిలిపోతున్నాయి. అలాగే భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు కూడా ఫ్లాప్ సినిమాలుగా మిగిలిపోతున్నాయి. ఇదే సమయంలో ఎలాంటి ? అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు నిర్మాతలకు కోట్లకు కోట్లు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి యాడ్ అయిపోతాడు హీరో శ్రీ విష్ణు.
తాజాగా ఆయన నటించిన సినిమా సామజవరగమన. ఈ మూవీ రీసెంట్గా ప్రేక్షకులకు ముందుకు వచ్చి ఎలాంటి సూపర్ సక్సెస్ అందుకుందో చెప్పనక్కర్లేదు. గత నెల 29న ఎంతో గ్రాండ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఎవరు ఊహించని రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే రు. 35 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.
అదేవిధంగా హీరోగా శ్రీ విష్ణుకు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. శ్రీ విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఇలాంటి సూపర్ హిట్ సినిమాను ఓ యంగ్ హీరో చేజేతులా వదలుకున్నాడు. ఈ సినిమా డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈ కథను ముందుగా యంగ్ హీరో సందీప్ కిషన్ కి చెప్పాడట.
స్టోరీ విన్న సందీప్ ఇది నాకంటే హీరో శ్రీ విష్ణు కే బాగా సూట్ అవుతుందని.. అతనితో ఈ సినిమా తీస్తే బాగుంటుందని.. సందీప్ కిషన్ నే స్వయంగా సజెస్ట్ చేశారట. అదే టైంలో సందీప్ కిషన్ “మైఖెల్” అనే యాక్షన్ సినిమాలో బిజీగా ఉండడంతో.. ఈ కథ నచ్చినా వదులుకోవాల్సి వచ్చింది. అలా సందీప్ కిషన్ బ్యాడ్లక్గా ఓ సూపర్ హిట్ మిస్ అయ్యాడు.