పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ – శృతిహాసన్ హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ తర్వాత తెరకెక్కనున్న సినిమా కావడం.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో కావడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మామూలుగా లేవు.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సంపాదించింది. టీజర్ రిలీజ్ అయిన నేపథ్యంలోనే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లకు పైనే అంటున్నారు. సలార్ సినిమా 2 బాగాలుగా రిలీజ్ చేస్తోన్న విషయం తెలిసిందే.
రూ. 400 కోట్లు బడ్జెట్ కేవలం ఒక భాగంకే అంత ఖర్చయిందా ? లేదా రెండు భాగాలకు కలిపి రూ.400 కోట్లు బడ్జెట్ పెట్టారా ? అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి ముందు తెరకెక్కించిన కేజిఎఫ్ రెండు భాగాలు రూ.400 కోట్ల కన్నా తక్కువ బడ్జెట్ అయ్యింది. అయితే పార్ట్ 2 ఏకంగా త్రిబుల్ ఆర్‌ను మించి రు. 1250 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది.
దీంతో చాలామంది నెటిజన్స్ రెండు భాగాలకు కలిపి రూ.400 కోట్లు బడ్జెటై ఉంటుందని అంచనా వేస్తున్నారు. సలార్ బడ్జెట్ న్యూస్ రు.400 కోట్లుగా వైరల్ అవ్వడంతో ఇది ప్రభాస్ రాజు మానియా రా అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ ని తెగ ఎత్తేస్తున్నారు ఫ్యాన్స్. ఇక భారీ అంచనాలతో రిలీజ్ కాబోయే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో ? చూడాలి.