బాల‌య్య – మాధురి దీక్షిత్ కాంబినేష‌న్లో మిస్ అయిన బాలీవుడ్‌ సినిమా ఇదే…!

ఆ హీరోయిన్‌తో బాలీవుడ్ ఛాన్స్ మిస్ అయిన బాల‌య్య‌.. ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే..!
నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలైన బాలయ్య బాక్సాఫీస్ దండయాత్ర.. ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో మరో లెవల్ కు వెళ్ళింది. భగవంత్ కేస‌రీ సినిమాతో హ్యాట్రిక్ విజయంపై కన్నేశాడు. ఈ సినిమా కూడా దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇలా వరుస సినిమాలతో టాలీవుడ్ కే చెమటలు పట్టిస్తున్న బాలయ్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.

ఇక గ‌తంలో బాలకృష్ణ బాలీవుడ్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. అప్పటికే చిరంజీవి తెలుగులో సూపర్ హిట్ అయిన అంకుశం సినిమాని ప్రతిబంద్‌ పేరుతో బాలీవుడ్ లో రీమెక్‌ చేశాడు. ఈ విధంగా చిరంజీవి బాలీవుడ్లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఇదే విధంగా టాలీవుడ్ నుంచి ఎంతో మంది హీరోలు బాలీవుడ్లో సినిమాలలో నటించి మంచి విజయాల‌ను అందుకున్నారు. అలా ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం బాలకృష్ణతో కలసి హిందీలో ఓ సినిమాను నిర్మించాలనుకున్నాడట.

ఆ సినిమాకి దర్శకుడు ఎన్. చంద్రను కలవడం కూడా జరిగిందట. ఇక ఈ సినిమాలోని హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. అప్పుడే తేజాబ్ సినిమాతో బాగా మంచి పేరు తెచ్చుకున్న టాప్ నటి మాధురి దీక్షిత్‌ను బాల‌కృష్ణ‌ సరసన నటించేందుకు తీసుకోవాలనుకున్నారు. కానీ హీరోయిన్ మాధురీ దీక్షిత్ తెలుగులో నటించడానికి అవకాశాలు వచ్చినా వాటిని తిరస్కరించింది. కానీ డైరెక్టర్ నిర్మాత పట్టుబట్టి ఆమెను ఒప్పించారు. అలా ఆమె ఈ సినిమాను ఒప్పుకోవడం కోసం కొద్దిగా ఆలస్యం అయింది.

అయితే డైరెక్టర్ చంద్ర డేట్స్ మ‌త్రం రెండు సంవత్సరాల వరకు ఖాళీగా లేకపోవడంతో సినిమా వాయిదా పడింది. కానీ డైరెక్టర్ డేట్స్ దొరికే సమయానికి బాలకృష్ణ టాలీవుడ్ లో బిజీ హీరోగా మారిపోయాడు. అలా బాలకృష్ణ.. బాలీవుడ్ సినిమాకు మధ్యలోనే బ్రేక్ ప‌డింది. ఒకవేళ బాలీవుడ్లో కూడా బాలకృష్ణ సినిమా చేసి ఉండుంటే ఆయన రేంజ్ మ‌రో లెవ‌ల్‌లో ఉండేదేమో..!