ఒకే కథతో సూప‌ర్‌ హిట్ కొట్టిన ఎన్టీఆర్- చిరంజీవి.. ఆ రెండు సినిమాలు ఇవే..!

చిత్ర పరిశ్రమలో ఒకే తరహా కథతో అటు ఇటు తిప్పి సినిమాలు తీయడం ఎంతో కామన్. చిత్ర పరిశ్రమలో ఉండే దర్శకులు, రైటర్లు ఎన్ని కథలని మాత్రం కొత్తగా తయారు చేస్తారు.. పాత కథలను.. ఉన్న కథలనే అటు ఇటు తిప్పి ప్రేక్షకులను కాస్త ఆలరింప చేసి హిట్‌లు కొడుతూ ఉంటారు. ఇదే సమయంలో సినిమా పేర్లు కూడా కొత్తవి లేకపోవడంతో.. ఒకప్పుడు వాడిన టైటిల్స్ ఇప్పుడు మళ్ళీ తిరిగి వాడేస్తున్నారు.

చిత్ర పరిశ్రమలో కథలను కాఫీ చేసి సినిమాలు చేయడం ఎప్పటినుంచో ఉన్నదే. ఇక్కడ విచిత్రం ఏమిటంటే గతంలో సూపర్ హిట్ అయిన సినిమా కథల‌నే ఇప్పుడు అటు ఇటు తిప్పి ఇప్పుడున్న దర్శకులు సినిమాలు తీసి హిట్‌లు కొడుతున్నారు. అలా ఇప్పుడు ఒకే కథతో మెగాస్టార్ చిరంజీవి- జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు సినిమాలు తీసి హిట్లు అందుకున్నారు. అలా హిట్ అయిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేరీర్‌లో బృందావనం సినిమా సూపర్ హిట్ కొట్టింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. సమంత- కాజల్ హీరోయిన్లుగా నటించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమా కూడా ఇదే తరహాలో సూపర్ హిట్ అయింది. సీనియర్ ద‌ర్శ‌కుడు జయంత్ సి పరాన్జీ ఈ సినిమాకు దర్శకుడు.. ఈ సినిమాలో కూడా హీరో ముందు చెల్లిని ప్రేమించి.. ఆ తర్వాత అక్కకు భర్తగా వస్తాడు.. ఈ సినిమాలో కూడా హీరో అంటే హీరోయిన్ తండ్రికి ఏమాత్రం ఇష్టం ఉండదు.

ఇక ఎన్టీఆర్ బృందావనం సినిమాలో కూడా దాదాపు ఇదే తరహా సన్నివేశాలు ఉంటాయి. ఎన్టీఆర్ ముందుగా సమంతను ప్రేమిస్తాడు ఆ తర్వాత కాజల్‌ను కాపాడేందుకు ఆమెకు లవర్ గా వెళ్తాడు. ఇక త‌ర్వాత హీరోకు వారిద్దరూ అక్క చెల్లెలు అన్న విషయం తెలుస్తుంది. ఎన్టీఆర్ అంటే హీరోయిన్ తండ్రికి అసలు ఇష్టం ఉండదు. ఇలా ఈ రెండు సినిమాలు దాదాపు ఓకే కథతో వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లోనూ కామెడీ కావాల్సినంత ఉంది. ఎమోష‌న్‌ల‌గా కూడా బాగా క్లిక్ అయ్యాయి. ఈ విధంగా ఈ రెండు సినిమాలు చిరు- ఎన్టీఆర్ కెరీర్ లోనే గొప్ప సినిమాలుగా నిలిచిపోయాయి.