టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ హీరోగా పేరు తెచ్చుకున్నన ప్రభాస్ తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి. కేజిఎఫ్ సీరిస్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడుగా మారిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుందని తాజాగా వచ్చిన టీజర్లో కూడా చూపించారు.
ఈ సినిమాపై ప్రభాస్ అభిమానుల్లోనే కాకుండా సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరియు ముఖ్యంగా కేజిఎఫ్ లాంటి బిగ్గెస్ట్ హిట్ తరవాత ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా కావటంతో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాపై ఎవరు ఊహించని అంచనాలు ఉన్నాయి. తాజాగా రిలీజ్ అయిన టీజర్ కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
టీజర్ చూసిన అభిమానులు కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని బొమ్మ బ్లాక్ బాస్టర్ పక్క అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సమయంలోనే సలార్ సినిమాని చేతులారా వదులుకున్న ఓ తెలుగు స్టార్ హీరోని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో మరి ఎవరో కాదు పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన బన్నీ. ఈ సినిమా కథని ప్రశాంత్ నీల్ ముందుగా అల్లు అర్జున్ కే చెప్పారట.
పుష్ప సినిమా లాగానే ఈ సినిమా కూడా మాస్ కథగా ఉందని.. బ్యాక్ టు బ్యాక్ ఒకే కథ లాంటి సినిమాలు చేస్తే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న కారణంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఈ కథతో చాలామంది హీరోలు చుట్టూ తిరిగిన ప్రశాంత్ నీల్ చివరిగా పాన్ ఇండియా హీరో ప్రభాస్తో కమిట్ అయ్యాడు. ఇప్పుడు దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఇక మరి ప్రభాస్ ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.