బాల‌య్య – మ‌హేష్ అక్క మంజుల కాంబినేష‌న్లో మిస్ అయిన సినిమా ఇదే..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కుటుంబాలుగా రాజ్యమేలుతున్న నందమూరి- అక్కినేని- ఘట్టమనేని- మెగా ఫ్యామిలీల నుంచి ఇప్పటికే ఎందరో హీరోలు చిత్ర పరిశ్రమలో హీరోలుగా కొనసాగుతూ స్టార్ హీరోలుగా ఉన్నారు. ఇదే సమయంలో ఈ కుటుంబాల నుంచి ఎందరో హీరోలు వచ్చిన హీరోయిన్లుగా మాత్రం ఎవరూ చిత్ర పరిశ్రమలో అడుగుబట్టి సక్సెస్ అవ్వలేకపోయారు. ఇదే క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడుగా మహేష్ బాబు టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్నాడు.

ఇక కృష్ణ న‌ట వార‌సురాలిగా ఆయ‌న కుమార్తె మంజుల కూడా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేశారు. షో లాంటి సినిమాలో న‌టించిన మంజుల త‌ర్వాత‌ నిర్మాత‌గా మారి ఏ మాయ చేశావే లాంటి హిట్ సినిమాలు కూడా తీశారు. అలాగే మ‌హేష్ బ్లాక్‌బ‌స్ట‌ర్ పోకిరి సినిమాకు కూడా మంజుల నిర్మాత‌. అయితే బాల‌కృష్ణ‌కు జంట‌గా మంజుల హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ కాంబినేష‌న్ సెట్ కాలేదు.

బాల‌య్య – సౌంద‌ర్య జంట‌గా ఎస్వీ. కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో టాప్‌హీరో సినిమా వ‌చ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ గా మంజులను అనుకున్నారు. బాల‌య్య కూడా త‌న‌కు అభ్యంత‌రం లేద‌నే అన్నారు. అయితే ఈ వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో కృష్ణ అభిమానులు డైరెక్టుగా కృష్ణ గారి ఇంటికి వెళ్లి మంజుల ఇత‌ర హీరోల‌తో ఆడి పాడితే మ‌న ప‌రువు ఏం కావాల‌ని కృష్ణ‌తోనే వాగ్వివాదానికి దిగారు.

ఈ రిస్క్ ఎందుకు ? అనుకున్న కృష్ణ గారు మంజులను సినిమా చేయ‌ద‌ని చెప్పేశారు. అలా బాల‌య్య‌కు జోడీగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాల్సిన మంజుల ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఆ త‌ర్వాత మంజుల ప్లేస్‌లో సౌంద‌ర్య‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఏదేమైనా కృష్ణ అభిమానుల‌కు ఇష్టం లేక‌పోవ‌డంతో బాల‌య్య – మంజుల కాంబినేష‌న్ మిస్ అయ్యింది.