టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అల్లరి నరేష్. అందరికీ భిన్నంగా కామెడీ జానర్ సినిమాల్లోనే నటిస్తూ చాలా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు అల్లరి నరేష్. అల్లరి అనే కామెడీ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ కేవలం కామెడీ సినిమాల్లోనే కాక ఇటీవల కాలంలో సీరియస్ జోనర్లో కొనసాగే సినిమాలో కూడా నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ తన చిన్నతనంలో చేసిన అల్లర్లని చెప్పుకొచ్చాడు. అల్లరి నరేష్ తన చిన్న వయసులో ఉన్నప్పుడు హాస్టల్‌కి వెళ్లడానికి అసలు ఇష్టపడేవాడు కాదట. ఇంట్లో ఉండడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసేవాడట. హాస్టల్ కి పంపిస్తే అక్కడ నుంచి పారిపోవడానికి కూడా చాలా రకాలుగా ప్రయత్నించేవాడట.
ఒకరోజు ఇవివి.. వెంకటేష్ హీరోగా నటించిన ” అబ్బాయిగారు ” సినిమా షూటింగ్ లో ఉన్నారట. అల్లరి నరేష్ కు ఆ సినిమా షూటింగ్ ఎక్కడ ? ఏ టైంలో జరుగుతుంది? అనే విషయాలన్నీ తెలుసట. అప్పుడు హాస్టల్‌కు వచ్చిన దోబితో మాటలు కలిపి మా నాన్న పెద్ద డైరెక్టర్ ఆయన సినిమాలో నీకు ఆఫర్ ఇప్పిస్తా.. నేను ఇచ్చే ఈ బట్టలు ఆయనకి ఇచ్చిరా అని చెప్పాడట.
ఆ బట్టల్లో నరేష్ నేను ఇక్కడ ఉండలేను అని ఒక కాగితంపై రాసి ఏడుపు ఎమోజీతో లెటర్ రాసి పెట్టి పంపాడట. అలాగే వాళ్ల స్నేహితులతో ఎవరితో అయినా గొడవలు జరిగినా లేదా ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు.. నేనెవరినో తెలుసా?.. మా నాన్న పెద్ద డైరెక్టర్.. నా జోలికి వస్తే ఆయన ఊరుకోడు అంటూ బ్లాక్మెయిల్ చేవాడట. ఇలా అల్లరి నరేష్ తన చిన్ననాటి చిలిపి జ్ఞాపకాలు అన్నిటిని ఆ ఇంటర్వ్యూలో షేర్ చేసుకోవడంతో అవి బయట పడ్డాయి.