చిత్ర పరిశ్రమ అంటేనే ఓ రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసే హిట్ కొట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. డేట్లు కుదరగా కథ నచ్చక ఇలా కొన్ని కారణాలతో కొంతమంది హీరోలు వదులుకున్న సినిమాలు వేరే హీరోలు చేతుల్లోకి వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇలానే టాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు ఉన్నాయి.
కొంతమంది దర్శకులు వారు కథ రాసుకునే సమయంలోనే ఫలానా హీరో అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. కానీ తర్వాత ఆ హీరో నో చెప్పేసరికి ఇతర హీరోలతో సినిమా చేసే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా మన తెలుగులో సూపర్ హిట్ సినిమాలు వదులుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇదే క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా ఊపిరి.
అక్కినేని నాగార్జున కోలీవుడ్ హీరో కార్తీ కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ముందుగా ఈ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి అక్కినేని నాగార్జున ఎన్టీఆర్ కాంబినేషన్లో ఈ సినిమా చేయాలని భావించారు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ సడన్గా ఎన్టీఆర్ ఈ సినిమా నుంచి తప్పకున్నట్లు ప్రకటించేసాడు.
అయితె ఎన్టీఆర్ ఈ సినిమాకు నో చెప్పడానికి ప్రధాన కారణం ఈ సినిమాలో వచ్చే ఓ సన్నివేశంలో ఎన్టీఆర్, నాగార్జున కాలు పట్టుకునే సన్నివేశం ఉంటుంది. అలా చేస్తే తన అభిమానులకు నచ్చదని ఎన్టీఆర్ సున్నితంగా ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లి కోలీవుడ్ హీరో కార్తీకి ఈ కథ చెప్పి ఒప్పించి నాగార్జున, కార్తీలతో ఈ సినిమా తీశాడు. ఇక ఈ సినిమా విడుదలై ఈ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. మరి రాబోయే రోజుల్లో అయినా నాగార్జున, ఎన్టీఆర్ కాంబోలో సినిమా వస్తుందో లేదో చూడాలి.