టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్న స్టార్ హీరోయిన్లు అందరికీ కూడా ఒక్కసారైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించాలని ఉంటుంది. ఎందుకంటే తెలుగులోనే విపరీతమైన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతామని.. అంతేకాకుండా ఆయన పక్కన నటించడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఇలాంటి అదృష్టాన్ని చేతులారా మిస్ చేసుకుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ దివంగత నటి ఆర్తి అగర్వాల్.
ఇక అసలు విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ దర్శకుడు కరుణాకరన్ కాంబినేషన్లో తొలిప్రేమ సినిమా తర్వాత బాలు సినిమా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ అయినా అభిమానులకు మాత్రం వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమైన సినిమాల్లో ఒకటి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ పాత్ర అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ సినిమా విడుదలైన తర్వాత అందరూ ఆ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చేసింది. అంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ పాత్రలో ముందుగా ఆర్తి అగర్వాల్ ని నటించమని అడిగారట.
ఆర్తి కూడా పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ ఛాన్స్ రావడంతో ఆమె ఎగిరి గంతులేసినంత పని అయ్యింది.. ఇక అప్పట్లోనే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉంది అంటూ ఓ ఇంటర్వ్యూలో కూడా ఆర్తి అగర్వాల్ చెప్పుకొచ్చింది.
అప్పటికే ఇతర సినిమాలకు కమిట్ అయిన ఓ సినిమా షెడ్యూల్ అనుకున్న దానికంటే ముందే రావటంతో అదే సమయంలో బాలు సినిమాకి డేట్స్ ఇవ్వటం కుదరలేదు. దీంతో ఆమె బాలు సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. అంత మంచి పాత్రను మిస్ అవ్వటం ఆర్తి అగర్వాల్ కి బ్యాడ్ లక్ అనే చెప్పాలి. కానీ కొన్ని సార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురుకోక తప్పదు.