తెలుగు చిత్ర పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి నట వారసుడుగా అడుగు పెట్టి టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. త్రిబుల్ ఆర్తో పాన్ ఇండియా హీరో అయిన చరణ్ ప్రస్తుతం ఎంత హ్యాపీగా ఉన్నాడో తెలిసిందే. గత పది సంవత్సరాలుగా ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎంతో ఆశగా ఎదురుచూసిన అభిమానులకి ఎంతో గుడ్ న్యూస్ చెప్పాడు రామ్ చరణ్
రామ్ చరణ్- ఉపాసన దంపతులకు రీసెంట్ గానే పండంటి పాప జన్మించింది. అంతే కాకుండా ఆ పాపకు బారసాల ఫంక్షన్ కూడా చేసి “క్లిం కార” అనే పేరుని కూడా పెట్టింది మెగా కుటుంబం. ఈ సమయంలోనే రామ్ చరణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే రామ్ చరణ్ ను ఓ స్టార్ హీరో అల్లుడుగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డాడట.
చిరు కూడా ఈ విషయంలో ఎంతో ఆశపడ్డాడట. రామ్ చరణ్ కి పెళ్లి చేయాలనే సమయంలో ఎవరైతే బాగుంటారా అంటూ ఆలోచించగా లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటుందని అందరూ భావించారట. అదే సమయంలో చిరంజీవి కూడా చరణ్ కి ఈ విషయం చెప్పగా అప్పుడు చరణ్ తాను ఉపాసనను లవ్ చేస్తున్న మేటర్ ని అందరికీ చెప్పాడు.
దాంతో శృతిహాసన్‌తో రామ్ చరణ్ పెళ్లి మాటల మధ్యలోనేే ఆగిపోయింది. ఒకవేళ చరణ్ అప్పటికీ ఉపాసనను ప్రేమించకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా రామ్‌చరణ్ – శృతిహాసన్ పెళ్లి జరిగి ఉండేదని అంటారు. ఆ విధంగా రామ్ చరణ్, కమల్ హాసన్ ఇంటికి అల్లుడుగా వెళ్లి ఉండేవారు అంటూ ఇప్పుడు కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు.