మహేష్ ‘ బిజినెస్‌మేన్‌ ‘ సినిమా వదులుకొని బాధపడిన స్టార్ హీరో…!

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో బిజినెస్‌మేన్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను మహేష్ కు పోకిరి లాంటి బంపర్ హిట్ ఇచ్చిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెర‌కెక్కించారు. మహేష్ కు మ‌రో అదిరిపోయే బంపర్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమాలో మహేష్‌కు జంట‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిగా సాయాజీ షిండే, ప్రకాశ్ రాజ్, నాజర్ కీలకపాత్రల‌లో నటించారు.

2012 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి అట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ వన్ మ్యాన్ షో చేశాడు. అదేవిధంగా పూరీ తన మార్క్ డైలాగుల‌తో ఈ సినిమా మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తమిళనాడుకు చెందిన ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ కథ‌ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడట. అదేవిధంగా ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన‌ తమన్, మహేష్- కాజల్ కెమిస్ట్రీ కూడా సినిమాను మరో లెవల్ కు తీసుకువెళ్ళింది.

ఈ సినిమాలో మహేష్- కాజల్ మధ్య రొమాన్స్ సన్నివేశాలకు మహేష్ తన భార్య న‌మ్ర‌త‌ దగ్గర పర్మిషన్ తీసుకున్నీ మరి నటించాడట. ఫైనల్ గా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే బిజినెస్ మేన్ సినిమాని ముందుగా మహేష్ బాబుతో చేయాలని పూరీ జగన్నాథ్ అనుకోలేదట.

ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో చేయాలని భావించారట. అయితే క‌థ నంచి సినిమా చేయ్య‌ల‌ని భావించిన అప్పటికి సూర్య‌కి డేట్స్ ఖాళీలేకపోవడంతో ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మహేష్ తో బిజినెస్ మేన్ సినిమా తీసి మరో హిట్ ఇచ్చాడు పూరీ. దాంతో సూర్య చెత్త సినిమాలు కారణంగా మరో బంపర్ హిట్‌ను వదులు కొన్నానని ఎంతో బాధపడ్డాడట.