ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు నిఖిల్. తర్వాత చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కార్తికేయా 2 తో పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ తో దూసుకుపోయాడు. నిఖిల్ తాజాగా స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పై ఇటీవల థియేటర్స్ లో రిలీజై ఫస్ట్ డే ఓపెనింగ్స్ లో మంచి రికార్డ్స్ సాధించింది. స్పై మొదటి రోజే ఏకంగా రూ. 11 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది.
ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు.. తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా సారీ చెప్తూ ఒక నోట్ రిలీజ్ చేశాడు నిఖిల్. ఇకపై నేను నటించే ఏ సినిమా అయినా సరే అన్ని భాషల్లో విడుదల చేసేలా జాగ్రత్తగా తీసుకుంటానని.. నాకు కెరియర్ లో స్పై సినిమాతో అత్యధిక ఓపెనింగ్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. నాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు.
కంటెంట్ డిలే సమస్యల కారణంగా అన్ని భాషల్లో కూడా స్పై సినిమాను విడుదల చేయలేకపోవడం నాకు ఎంతో బాధను కలిగించిందని.. ఓవర్సీస్ లో కూడా 350 వరకు తెలుగు ప్రీమియర్ షోలు రద్దు అయ్యాయి.. హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకులు అందరికీ నేను క్షమాపణలు తెలుపుతున్నాను.. రాబోయే మూడు చిత్రాలు అన్ని భాషల్లో అన్ని థియేటర్స్ లో పర్ఫెక్ట్ గా ఉండేలాగా నేను చూసుకుంటానని
తెలిపాడు.
ఇక పర్ఫెక్ట్ క్వాలిటీ ఉన్న మంచి సినిమాను మీకు అందిస్తానంటూ.. కంటెంట్ విషయంలో అసలు రాజీపడనని వెల్లడించాడు నిఖిల్. మొత్తానికి ప్రేక్షకులకు సారీ చెబుతూ నిఖిల్ రాసిన నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదే క్రమంలోనే ఇటు నిర్మాతను టార్గెట్ చేస్తూ కూడా నిఖిల్ కామెంట్లు ఉన్నాయన్న చర్చ అయితే జరుగుతోంది.