వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమానే హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్ తర్వాత హిట్లు, ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ క్రేజ్ తో దూసుకుపోయింది. టాలీవుడ్ లో అగ్రతారల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్ లోనే కాక హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలో కూడా నటించింది రకుల్.
ఒకానొక టైంలో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుండడంతో రకుల్ కాల్షీట్లు అస్సలు ఖాళీ లేవు. ప్రస్తుతం టాలీవుడ్లో ఛాన్స్‌లు లేకపోవడంతో బాలీవుడ్‌కి అంకితం అయ్యింది. తాజాగా రకుల్‌పై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రకుల్ గతంలో హీరో రానా దగ్గుబాటిని ప్రేమించిందట. అతని పెళ్లి చేసుకుని దగ్గుపాటి ఫ్యామిలీ కోడలు కావాలని చాలా ప్రయత్నాలు చేసిందట.
కానీ రానా మాత్రం రకుల్ ని ఎప్పుడు ఒక మంచి స్నేహితురాలు గానే చూసేవాడని.. ఓ రోజు రకుల్ తాగి రానా ఇంటికి వెళ్లి హద్దులు మీరి ప్రవర్తించిందని.. రానాని ఎలాగైనా లొంగదీసుకోవాలని చూసిందంటూ బాగా పుకార్లు వైరల్ అయ్యాయి. రకుల్ దగుబాటి ఇంటి కోడలు కాబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా ట్రెండ్ అయ్యాయి. ఈ వార్త రానా వరకు వెళ్లడంతో రకుల్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట.
రానా అప్పటికే మహీకను ప్రేమించడమే దానికి కారణం అట. రానా స్టిక్ట్ వార్నింగ్ ఇవ్వడంతో అప్పటి నుంచి రకుల్ రానా వైపు కన్నెత్తి కూడా చూడలేదట. అలా రకుల్.. దగ్గుబాటి ఫ్యామిలీ కోడలయ్యే ఛాన్స్ మిస్ చేసుకుందంటూ అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. దీనిపై స్పందిస్తు రకుల్ హేటెర్స్ చాలామంది ఆమెపై ట్రోల్స్ చేశారు.