టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. ఇక తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోలకు సమానంగా భారీ అభిమానులను సంపాదించుకుంది.
ప్రస్తుతం ఈ బబ్లీ బ్యూటీ `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అనుష్క యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి జంటగాా నటిస్తుంది. బాహుబలి సినిమాల తర్వాత అనుష్క దగ్గర నుంచి సరైన సినిమా రాలేదు. ఈమె వెండితెరపై కనిపించి చాలాకాలం అవడంతో. `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` సినిమా కోసం ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అనుష్క సినిమాల విషయం ఇలా ఉంచితే ఆమెకు నాలుగుపదుల వయసు వచ్చినా ఇప్పటికీ పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. అనుష్క పెళ్లి గురించి ఇప్పటికి ఎన్నో వార్తలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందని త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని ఇప్పటికి రూమర్లు వస్తున్నాయి. కానీ ఈ వార్తలపై అటు అనుష్క ఇటు ప్రభాస్ ఇద్దరూ తమూ స్నేహితులమే అని తేల్చేస్తున్నారు.
ఇదే సమయంలో అనుష్క ప్రభాస్ కంటే ముందే ఓ స్టార్ హీరోను గాఢంగా ప్రేమించిందని వార్త ఇప్పుడు వినిపిస్తుంది. అలా అనుష్క ప్రేమించిన ఆ స్టార్ హీరో మరెవరో కాదు యాక్షన్ హీరో గోపీచంద్.
అనుష్క- గోపీచంద్ జంటగా శౌర్యం, లక్ష్యం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే అనుష్క- గోపీచంద్ బాగా దగ్గరయ్యారట ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రేమలో కూడా పడ్డారట. కానీ ఇద్దరు తమ ప్రేమని బయటకు చెప్పలేకపోయారు.
అయితే అనుష్కను గోపీచంద్ ప్రేమిస్తున్నాడని అతడి ఇంట్లో తెలిసిపోయిందట. అప్పటినుంచి అనుష్కతో గోపీచంద్ కుటుంబ సభ్యులు మాట్లాడటం మానేశారట. ఇండస్ట్రీకి చెందిన అమ్మాయితో ప్రేమ, పెళ్లి వద్దని గోపీచంద్ కు ఆయన తల్లి బలంగా చెప్పిందట. దాంతో అనుష్కను గాఢంగా ప్రేమించిన గోపీచంద్.. ఫ్యామిలీ కోసం ఆమెను దూరం పెట్టాడట.
తన ప్రేమను అనుష్కకు చెప్పకుండానే చంపుకున్నాడట. గోపీచంద్ ప్రవర్తనలో మార్పులు రావడంతో అనుష్క సైతం అతడికి ప్రేమ విషయాన్ని చెప్పకుండా ఫ్రెండ్షిప్ ను కొనసాగించిందని తెలుస్తుంది. ఇందులో నిజం ఎంతన్నది పక్కన పెడితే ప్రభాస్ కంటే ముందే అనుష్క గోపీతో చాలా క్లోజ్‌గా ఉండేదన్నది మాత్రం నిజం.