కళ్యాణ్ రామ్ “డెవిల్” టీజ‌ర్‌… గూఢచారిగా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ప‌క్కా ( వీడియో )

నందమూరి కళ్యాణ్ రామ్ గత సంవత్సరం బింబిసార‌ సినిమాతో తన కెరీర్ లోనే భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్‌ను తన ఖాతాలు వేసుకున్నాడు. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ వరుస‌ డిఫరెంట్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక అదే క్ర‌మంలో అమీగోస్‌ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి కాస్త నిరాశపర్చినా ఇప్పుడు మరో డిఫరెంట్ స్పై యూనివర్స్‌ మూవీ డెవిల్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.

ఇక ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ కాలం నాటి ఏజెంట్‌గా కనిపించబోతున్నాడు. ఈరోజు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేశారు. ఆ టీజ‌ర్ లో కూడా కళ్యాణ్ రామ్ ఎంతో డిఫరెంట్ గా కనిపించాడు. యాక్షన్ సన్నివేశాలు కూడా మరో లెవల్లో ఉన్నాయి. ఇక కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగులు కూడా ఎంతో మాస్‌గా ఉన్నాయి.

మీరు చెప్పేదానికి.. చేసేదానికి.. ఆలోచించేదానికి అస్స‌లు సంబంధం లేదు సార్‌.. మ‌న‌సులో ఉన్న భావ‌న మొఖంలో తెలియ‌కూడ‌దు.. మెద‌డులో ఉన్న ఆలోచ‌న‌.. మాట‌ల్లో బ‌య‌ట‌ప‌డ‌కూడ‌దు.. అదే గూఢ‌చారికి ఉండాల్సిన ముఖ్య‌ల‌క్ష‌ణం. అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ కూడా గూఢ‌చారి అనేవాడు ఎలా ?ఉంటాడో ఈ సినిమాలో ఎంతో క్లియర్‌గా చూపిస్తారు అని తెలుస్తుంది.

ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మరో బంపర్ హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది. ఈ సినిమాను దర్శకుడు నవీన్ మేడారం తెర‌కెక్కించ‌గా… హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తుండగా హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే అభిషేక్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.