పెళ్లికి ముందే సుమ‌ను లేపుకుపోయే ప్లాన్ వేసిన రాజీవ్… ఇంత ట్విస్ట్ జ‌రిగిందా..!

సుమ – రాజీవ్ కనకాల ఈ పెయిర్ గురించి టాలీవుడ్‌లో తెలియని వారు ఎవరు ఉండరు. వీరిద్దరూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దం దాటుతున్నా ఇప్పటికీ ఎవరి సత్తా చాటుతున్నారు. సుమ బుల్లితెరపై యాంకర్‌గా పలు షోలు నిర్వహిస్తూనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీ షెడ్యూల్‌ని గడుపుతుంది. అలాగే రాజీవ్ కనకాల వెండితెరపై కీరోల్స్ ప్లే చేస్తూ కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు.

నిన్న మొన్నటి వరకు రాజీవ్ కనకాల ఏదైనా సినిమాలో చనిపోయాడు అంటే ఆ సినిమా హిట్ అనే టాక్ సినీ వర్గాల్లో వినిపించేది. కాగా విరూపాక్ష మూవీ ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసింది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల పాత్ర‌కి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం రాజీవ్ కనకాల బాగ్ సాలే మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు రాజీవ్. ఈ ఈవెంట్ కు హోస్ట్ గా సుమ‌ వ్యవహరించింది.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ తను పెళ్లికి ముందు సుమని లేపుకుపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని.. సుమ పేరెంట్స్ మా పెళ్లికి ముందుగా ఒప్పుకోలేదని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సుమ‌ పేరెంట్స్ పెళ్ళికి ఒప్పుకోవడంతో ఆమెను లేపుకోపోవాల్సిన అవసరం రాలేదని రాజీవ్ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత సుమ బాగ్ సాలే సినిమాను ఎందుకు ? చూడాలని అడగడంతో కాలభైరవ కొన్ని ఆసక్తి కర విషయాలను బయటపెట్టాడు.

దీంతోపాటే ఈ సినిమాలో రాజీవ్ కనకాల చనిపోడ‌ని.. బ్రతికే ఉంటాడ‌ని చెప్పుకొచ్చాడు. రాజీవ్ కనకాలను డైరెక్టర్ ప్రవీణ్‌ని సంప్రదించినప్పుడు ఈ సినిమాలో మీరు చనిపోరని చెప్పగానే రాజీవ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని కాలభైరవ పేర్కొన్నాడు. కాలభైరవ ఈ సినిమా గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.