చిత్ర పరిశ్రమలో ఉండే సెలెబ్రెటీలకు ఎంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. వారు ఏ పని చేసిన అది పెద్ద సంచలంగా మారుతుంది. వారి అభిమానులకు అది ఎంతో గొప్పగా ఉంటుంది. చిత్ర పరిశ్రమలో ఉండే స్టార్ సెలబ్రిటీల పెళ్లిళ్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు వారికి పెళ్లి సెట్ అవ్వక ముందు నుంచే ఎన్నో రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి.
అదేవిధంగా సెలబ్రిటీలు కూడా వారిని అభిమానించే అభిమానుల విషయంలో ఎంతో కేర్ఫుల్ గా ఉంటారు. ఈ క్రమంలోనే కొంత మంది సెలబ్రిటీలు తమ అభిమానుల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు. అలా వారి అభిమానుల్ని పెళ్లి చేసుకున్న స్టార్ సెలబ్రిటీల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
ముందుగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న విలక్షణ నటుడు మాధవన్ తన భార్య సరితను కమ్యూనికేషన్స్ స్కిల్స్ క్లాస్లో కలిశారట. చిత్రపరిశ్రమలోకి రాకముందు మాధవన్ కమ్యూనికేషన్స్ స్కిల్ డెవలప్మెంట్ క్లాసులు చెప్పే వారట. అలా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా తన అభిమానినే పెళ్లి చేసుకున్నాడు. ఆయన భార్య సంగీత ఓ సినిమా షూటింగ్లో విజయ్ను కలిశారట. అదే సమయంలో విజయ్ అంటే ఇష్టమని ఆమె చెప్పడంతో ఆటోగ్రాఫ్ తో పాటు ఆమెకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారట. అలా వీరి పరిచయం మొదలై ప్రేమగా మారి పెద్దలు అంగీకారంతో పెళ్లి వరకు వెళ్ళింది. ఇక మరో బాలీవుడ్ హీరోయిన్ ఈషా డియోల్ , భరత్ తక్తాని అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. ఇక ఈషా డియోల్ కి భరత్ పెద్ద ఫ్యాన్ .. వారి పరిచయం ప్రేమగా మారి,పెళ్ళికి దారితీసింది.
సూపర్ స్టార్ రజనీకాంత్, అతని భార్య లతా రంగాచారి..వీరిద్దరి పరిచయం అనూహ్యం. తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన లతతో సూపర్ స్టార్ ప్రేమలో పడ్డారు.ఎథిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్ధిగా ఉన్నప్పుడు లత సూపర్ స్టార్ ని ఇంటర్వ్యూ చేశారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో 26 ఫిబ్రవరి 1981 న తిరుపతిలో వారి పెళ్లయింది. మరో బాలీవుడ్ హీరోయిన్ డింపుల్ కపాడియా కూడా రాజేష్ కన్నాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అప్పటికి రాజేశ్ కన్నా సినిమాలకు దూరం అయ్యారు..కానీ అయన మీద ఉన్న అభిమానంతో తనని డింపుల్ పెళ్లిచేసుకుంది. వాళ్ళ కూతురే ట్వింకిల్ కన్నా.. ఆమె అక్షయ్ కుమార్ ని వివాహం చేసుకుంది. ఇలా ఎంతమంది స్టార్ హీరోలు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తమను అభిమానించిన అభిమానులనే పెళ్లి చేసుకుని తమ జీవితంలో ఎంతో హ్యాపీగా ఉన్నారు.