రామ్‌చ‌ర‌ణ్‌, నాగచైత‌న్య‌పై త‌మ‌న్నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు… మండిప‌డుతోన్న బ‌న్నీ ఫ్యాన్స్‌..!

కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో తమన్నా హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా తమన్నా లస్ట్ స్టోరీస్ 2 లో సందడి చేసింది. ఈ సిరీస్ లో తమన్నా రొమాంటిక్ సీన్స్ సోషల్ మీడియాలో హీట్ పెంచాయి. ఆ సీన్స్ పై ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి. తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో తమన్నా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ తో వారి వారసులతో పనిచేసినప్పటి అనుభవాలను తమన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది.

సౌత్ స్టార్లు తనతో ఎంతో గౌరవంగా ప్రవర్తించారని మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా చెప్పింది. రామ్ చరణ్ – నాగ చైతన్య తదితర స్టార్లు సూపర్ స్టార్ల ఆలనాపాలనలో చాలా చక్కగా పెరిగారని తమన్నా అభివర్ణించారు. నేను రామ్ చరణ్, చైతన్యతో నటించానని వాళ్ళు చాలా మర్యాదగా. గౌరవంగా ఉంటారని చెప్పింది. వాళ్ళు చాలా బాగా పెరిగారని అభివర్ణించారు.

అయితే తను స్టార్ హీరోయిన్ అవుతానని మొదట నమ్మింది మెగాస్టార్ చిరంజీవి అని తమన్నా ఇంటర్వ్యూలో చెప్పింది. మోజో స్టోరీపై బర్ఖా దత్ తో జరిగిన సంభాషణలో తమన్నా ఈ వ్యాఖ్యలు చేసారు. తమన్నా తరువాత సినిమా రజినీకాంత్ తో చేసింది. రజినీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాలో తమన్నా నటించింది. తమన్నా మాట్లాడుతూ కేవలం ఒకరోజు పనిచేసినప్పటికీ రజనీ సర్ నా గురించి ఆలోచించి ఒక పుస్తకం కొనిచ్చారని గుర్తు చేసుకున్నారు.

ఈ చిత్రం ఆగస్ట్ 10న విడుదల కానుండగా ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో పాటు చిరంజీవి ‘భోలా శంకర్’లో నటిస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్- సుశాంత్ ఉన్నారు.
తమన్నా వరుస సినిమాలతో పాటు సోషల్ మీడియాలోను బిజీ బిజీగా ఉంది. వరుస ఫోటో షూట్ లతో నెట్టింట హల్ చల్ చేస్తుంది. తాజాగా వచ్చిన ల‌స్ట్‌స్టోరీస్ 2లో ఇప్పటికే తమన్నా రెచ్చిపోయింది. ఆ సిరీస్ చూసిన వాళ్ళందరూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

అయితే బ‌న్నీతో కూడా త‌మ‌న్నా బ‌ద్రినాథ్ సినిమాలో న‌టించింది. బ‌న్నీ స్టార్ హీరో వార‌సుడు కాక‌పోయ‌నా బ‌ల‌మైన సినీ నేప‌థ్యం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చిన వార‌సుడే. ఇక్క‌డ త‌మ‌న్నా బ‌న్నీ పేరు చెప్ప‌క‌పోవ‌డంతో బ‌న్నీ ఫ్యాన్స్ త‌మ‌న్నా మా హీరో పేరు క‌నీసం మాట‌మాత్రంగా అయినా ప్ర‌స్తావించ‌లేదంటూ మండిప‌డుతున్నారు.