ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్రపరిశ్రమలో, సోషల్ మీడియాలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారుతూ వస్తుంది. టాలీవుడ్‌కు సీతారామం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన మృణాల్ ఠాకూర్.. ఆ తర్వాత అదే స్టైల్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతూ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంది.
రీసెంట్‌గానే బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన లస్ట్ స్టోరీస్ 2 లో నటించిన ఈమె బోల్డ్ సీన్స్ లో నటించి యువతను మైమరిపింపజేసింది. ఎంతలా అంటే ఆ సిరీస్‌లో మృణాల్ పచ్చి బూతు పదాలను, నాటీ నాటి పదాలను సైతం ఎంతో అవలీలగా మాట్లాడేస్తూ హాట్ ఎక్స్ప్రెషన్స్ తో ఓటీటీని తన వైపు ఒక్కసారిగా తిప్పుకుంది. ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త గురించి కొన్ని సీక్రెట్లు రివిల్ చేసింది.
ఆ ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. అందరి అమ్మాయిల్లా నాకు డబ్బు పై ఆశ లేదు.. అందంగా ఉండక్కర్లేదు అని నేను చెప్పను.. నాకు కొన్ని ఆశలు, కోరికలు ఉన్నాయి.. నేను చేసుకోబోయే అబ్బాయి ఇలా హైట్ ఉండాలి ఇంత కలర్ ఉండాలి.. ఇంత ఫిట్‌గా ఉండాలంటూ నా చిన్నతనం నుంచి ఊహించుకునే దాన్ని.. అయితే ఇప్పుడు మాత్రం వాటన్నిటికన్నా నన్ను అర్థం చేసుకునే మనసు ఉండాలని డిసైడ్ అయ్యాను.
ముఖ్యంగా నేను చేసే పని పట్ల ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి.. నేను చేసే పనిపై ఎప్పుడు గౌరవం ఉంచాలి.. అలాంటి పెద్ద మనసు ఉన్న అబ్బాయి దొరికితే నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇక పెళ్లి తర్వాత సినిమాల్లోకి రాకూడదన్న రూల్స్ నాకు లేవు.. పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావేమో అన్న భయం నాకు ఎప్పుడూ లేదు అంటూ ఫటాఫట్ జవాబులు ఇచ్చి సోషల్ మీడియాని షేక్ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.