చిత్ర పరిశ్రమలో ఎంత పెద్ద స్టార్ హీరోకైనా ఒక్కొక్క హీరోకి ఒక్కో హీరో, హీరోయిన్లు అంటే ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమలో ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉండే ఇద్దరు హీరోలు బాలకృష్ణ- చిరంజీవికి ఏ హీరో అంటే ఇష్టం.. ఆ హీరో నటించిన ఫేవరెట్ సినిమా ఏంటి అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ తనకు గత 40 సంవత్సరాలుగా ఎంతో టఫ్ ఫైట్ ఇచ్చే చిరంజీవి నటించిన సినిమాల్లో ఓ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆ సినిమాను ఇప్పటికీ చూస్తాను అని చెప్పడం ఎంతో హాట్ టాపిక్ గా మారింది.మన తెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ- చిరంజీవి బాక్సాఫీస్ వార్ అంటే ఎంతో మజాగా ఉంటుంది.
ఇక వీరిద్దరి సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగితే వారి అభిమానుల మధ్య కూడా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే విధంగా పోట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఇద్దరు హీరోలు ఎక్కడ ? కనిపించినా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరింట్లో జరిగే ఫంక్షన్లకు వెళ్తూ ఉంటారు. బాలయ్యకు, చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా అంటే ఎంతో ఇష్టమట.
ఇక సినిమాని బాలయ్య పదుల సార్లు చూశాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక దీంతో సోషల్ మీడియాలో ఆ న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది. పాత తరం చిరంజీవి అభిమానులను ఎవర్ని అడిగినా ముందుగా తమకి ఇష్టమైన సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరిని చెబుతూ ఉంటారు. అంత చక్కగా ఆ సినిమానీ దర్శకేంద్రుడు తెర్కెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, శ్రీదేవి నటన కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది.
అందుకే ఆ సినిమా బాలయ్యకి సైతం ఎంతో ఇష్టమట. ఎన్నిసార్లు చూసినా ఆ సినిమాని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందట. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు కూడా ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ యంగ్ హీరోలను కూడా ఎంతో భయపడుతున్నారు. ఇప్పటికే చిరంజీవి భోళా శంకర్ సినిమాతో ఆగస్టులో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. బాలయ్య కూడా దసరాకి భగవంత్ కేసరితో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు.