బాబి సినిమాలో బాల‌య్య ఎవ్వ‌రూ ఊహించ‌ని రోల్‌… మ‌ళ్లీ అలా క‌నిపిస్తున్నాడా…!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుంటూ క్రేజీ డైరెక్టర్ల‌తో సినిమాలు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం బాలయ్య స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా దసరా కానుక‌గా ప్రేక్షకు ముందుకు రానుంది. తన 109వ సినిమాను కూడా బాలయ్య ఇప్పటికే లైన్లో పెట్టాడు.

రీసెంట్గా తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఆ సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమాను మెగా దర్శకుడు బాబీతో చేస్తున్నాడు. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా రకుల్ ప్రీత్ సింగ్, నయనతార ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది.

అంతేకాకుండా ఈ సినిమాలో బాలకృష్ణ 70 ఏళ్ల వయసున్న పెద్దాయన రోల్‌లో కనిపించనున్నారని అంటున్నారు. మొన్నటివరకు యంగ్ గా కనిపించే పాత్రలను ఒప్పుకున్న బాలయ్య ఇప్పుడు మాత్రం తన వయసుకు తగిన పాత్రలను ఓకేకే చేసుకుంటూ తన తోటి హీరోలకు షాకుల‌లు మీద షాక్ లు ఇస్తున్నాడు. ఈ సినిమాలో కూడా బాలయ్య తండ్రి కొడుకులుగా కనిపించనున్నారని తెలుస్తుంది.

ఇప్పటివరకు బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవికి వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ సక్సెస్ ఇచ్చిన‌ బాబి ఈ సినిమాని కూడా అదే రీతిలో బాలయ్యకు మరో సక్సెస్ చేయటం గ్యారెంటీ అంటూ బాలయ్య అభిమానులు ఇప్పటికే సంబరపడిపోతున్నారు.

బాల‌య్య కూడా కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం. బాలయ్య బాబీ కాంబో మూవీకి కోన వెంకట్ కథ అందిస్తున్నారు. భిన్నమైన కథలను బాలయ్య ఎంచుకోవడంతో సినిమా సినిమాకు బాలయ్య రేంజ్ పెరుగుతోంది.