అక్కినేని నాగేశ్వర రావుకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిన భానుమతి భర్త.. తెర వెనుక అంత జరిగిందా..?

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు… స్వ‌త‌హాగా నాన్‌వెజ్ అంటే ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. ఆయ‌న‌కు కూడా అన్న‌గారి మాదిరిగానే నాటుకోడి రుచులు ఎంతో ఇష్టం. షూటింగ్ స‌మ‌యంలోనూ.. ఆయ‌న ఇంటి నుంచి భోజ‌నం తెప్పించుకుని తినేవారు. ఎక్క‌డున్నా త‌న‌వెంట కుక్‌ను తీసుకువెళ్లేవారు. అలాంటిది ఒక సంద‌ర్భంలో అక్కినేని దాదాపు ఏడాదిపాటు నాన్ వెజ్ ముట్టుకోకుండా ఉండిపోయారు.

దీనికి కార‌ణం.. ఒక‌వైపు ఒప్పందం అయితే.. మ‌రోవైపు వ‌రుస పెట్టి అన్నీ భక్తి సినిమాలే రావ‌డం. ఈ రెం డు కార‌ణాల‌తో అక్కినేని సుమారు ఏడాదిపాటు నాన్ వెజ్‌కు దూరంగాఉండిపోయారు. భానుమ‌తి – అక్కినేనిన‌టించిన సినిమాల్లో ఎవ‌ర్ గ్రీన్ హిట్‌.. విప్ర‌నారాయ‌ణ‌. ఈ సినిమాలో పాండురంగ‌ను భ‌క్తుడిగా అక్కినేని న‌టించారు. ఈ సినిమాను భానుమ‌తి భ‌ర్త రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

భానుమ‌తి, రామ‌కృష్ణ‌లు స‌హ‌జంగానే ఎంతో నిష్ట‌గా ఉంటారు. ఇలానే.. సినిమాల విష‌యంలోనూ జాగ్ర‌త్త లు తీసుకునేవారు. విప్ర‌నారాయ‌ణ విష‌యంలోభ‌క్తుడి పాత్ర‌ను అక్కినేనితోనే వేయించాల‌ని భానుమ‌తి ప‌ట్టుబ‌ట్టారు.ముందు అక్కినేని వ‌ద్ద‌న్నా.. త‌ర్వాత ఒప్పుకొన్నారు. అయితే.. రెమ్యున‌రేష‌న్ ఎంతైనా తీసుకోండి కానీ.. సినిమా పూర్త‌య్యే వ‌ర‌కు నాన్‌వెజ్ ముట్టుకోవ‌ద్దు.. అని రామ‌కృష్ణ ష‌ర‌తు పెట్టారట‌.

దీనిని మొద‌ట్లో అక్కినేని అంగీక‌రించ‌క‌పోయినా.. త‌ర్వాత కాద‌న‌లేక పోయారు. ముఖంలో మ‌రింత అందం ఉట్టిప‌ట్టేందుకు నాన్ వెజ్ జోలికి పోవ‌ద్ద‌న్న రామ‌కృష్ణ స‌ల‌హాను ఆయ‌న తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటించారు.