కన్నడ బ్యూటీ కృతి శెట్టి ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. నటించిన మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కృతి. ఆ తర్వాత నటించిన సినిమాలని ఫ్లాప్ అయినా అడపాదడపా సినిమాలో నటిస్తుంది. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన కృతికి తర్వాత అన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఐరెన్ హీరోయిన్ గా పేరు వచ్చేసింది.
దీంతో ఎలాగైనా సినిమాల్లో ఛాన్స్‌లు సంపాదించాలనే ఉద్దేశంతో అందాన్ని మరింతగా పెంచుకోవడానికి మెడిసన్స్ తీసుకుంటుందట కృతి. ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోయిన్లు వారి అందాన్ని పెంచుకోవడానికి అనేక విధాలుగా ఫిట్నెస్ అంటూ డైటింగ్ అంటూ రకరకాల టిప్స్ ను ఫాలో అవుతూ పర్సనాలిటీని అలానే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ ట్రెండ్ కూడా మారింది అందంగా కనిపించడానికి కొన్ని మందులను కూడా వాడుతున్నారట స్టార్ హీరోయిన్లు.
అదే లిస్టులో కృతి శెట్టి చేరిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వయసుకు మించి అందం.. ముఖంలో చార్మింగ్ నెస్ మిస్ అవ్వడంతో.. బడా డైరెక్టర్స్ పట్టించుకోవట్లేదట. అందుకే ఇంకా అందంగా కనపడాలి అని..ఆ ఉద్దేశంలో ఇలా మందులు వాడుతుందట కృతి. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారడంతో కృతిని జనం నెగిటివ్ కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు. అందం కోసం ఇలాంటి పనులు చేస్తుందా..? ఇంతకు దిగజారిపోయిందా.. > ఈ దరిద్రం ఏంటి ..కృతి..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.