బాక్స్ ఆఫీస్ రికార్డులు తుక్కుతుక్కు చేసిన శ్రీ విష్ణు.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా..!

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అవుతుందో? ఏ సినిమా ప్లాప్ అవుతుందో? ఎవ‌రు అంచనా వేయలేకపోతున్నారు. కొన్ని కొన్ని భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి బోల్తా కొడుతున్నాయి. అలానే అసలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చాలా తక్కువ బడ్జెట్ తో వ‌చ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డ్స్ సాధిస్తున్నాయి. అదే లిస్టులో ఇప్పుడు సామజవరగ‌మ‌న‌ సినిమా కూడా యాడ్ అయిపోయింది.

టాలీవుడ్ లో మధ్యస్థ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు నటించిన సామజవరగమన ప్రస్తుతం అనుకున్న దానికన్నా భారీ బడ్జెట్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టింది. ఇప్పటికే చాలామంది టాలీవుడ్ స్టార్ ప్రముఖులు ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా చాలా బాగుందని మనస్పూర్తిగా నవ్వుకొని చాలా రోజులవుతుంది మళ్ళీ ఈ సినిమా ద్వారా కడుపుబ్బ నవ్వుకో గలిగామని ట్విట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

ఈ సినిమాలో నరేష్ – వెన్నెల కిషోర్ కి రోల్స్ ప్లే చేస్తూ కామెడీ టైమింగ్ అదరగొట్టారు. ఇటీవల కాలంలో సరైన హిట్టే దొరకని శ్రీ విష్ణుకి ఇది మంచి కమ్‌బ్యాక్ అనే చెప్పాలి. ఈ సినిమాను రామ అబ్బిరాజు మంచి కామెడీ నెప‌ద్యంలో తెర‌కెక్కించారు. ఈ సినిమా సినీ ప్రముఖుల ప్రశంసలతో పాటు కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లోనే వసూలు చేసింది. జూన్ 29న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా నాలుగు రోజులు పూర్తి చేసుకునే టైంకి ఏకంగా ఎవ‌రు ఊహించ‌ని విధంగా రూ. 19.8 కోట్ల భారీ షేర్స్ ని వసూళ్ళు చేసి అదరగొట్టింది.