అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తన తర్వాత సినిమాని యంగ్ హీరో రామ్‌తో చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం రామ్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 15న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు మేకర్స్ . ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది చిత్ర బృందం ప్రమోషన్లు కూడా వేగవంతం చేస్తుంది.
ఇక గతంలో ఈ సినిమా పోస్టర్లను విడుదల చేసి ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచగా.. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేసారు మేకర్స్. ఈ మాస్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమా పై మరింత హైప్ ను పెంచేసింది. రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది ఈ సినిమా . ఇక ఈ సినిమాకు ‘స్కంద’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు మేకర్స్.
ఇక గ్లింప్స్ విషయానికొస్తే.. రామ్ పోతినేని చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. యాక్షన్ మాత్రం నెక్ట్ లెవల్లో ఉంటుందని తెలుస్తోంది. రామ్ మాస్ అవతార్ లో రచ్చ రచ్చ చేస్తున్నాడు. రామ్ కూడా మాస్ డైలాగులతో అదరగొట్టాడు ‘మీరు దిగితే ఊడేదుండదు.. నేను దిగితే మిగిలేది ఉండదు’ అంటూ రామ్ చెప్పే డైలాగ్ అదిరిపోయేలా ఉంది. తమన్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాను మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. ఈ సినిమాలో రామ్‌కు జంటగా టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీలా నటిస్తోంది. ఇక మరి ఈ మాస్ అవతారంలో రామ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి..!!