చిత్ర పరిశ్రమకు తండ్రి పేర్లు, తాతల పేర్లు చెప్పుకునీ వారసులుగా ఎంతో ఈజీగా ఎంట్రీ ఇవ్వచ్చు . అయితే ఎలాగో ఎంట్రీఇస్తే సరిపోదు దానికి తగ్గట్టుగా వారీ దగ్గర నుంచి అవుట్ పుట్ కూడా ఉండాలి . అలా వారసులుగా ఎంట్రీ ఇచ్చి చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోలేక చాలామంది సినిమాలు తీయడం మానేశారు. అయితే ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆయనే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. ఈయనను ఎప్పటినుంచో హీరోగా లాంచ్ చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది.
బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లో అడుగు పెట్టాడు. తర్వాత తన నటన – డైలాగులతో ప్రేక్షకులు మెప్పించాడు. ఆరు పదుల వయసులో కూడా ఇప్పటికీ నేటితరం హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలయ్య భగవంత్ కేసరి మూవీని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొడుకు టాలీవుడ్ ఎంట్రీ కోసం.. బాలయ్య ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం.
బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే ఈ ఏడాది ఈ యువసింహం ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. అందులోనూ ఈ మధ్య మోక్షజ్ఞ స్లిమ్ అండ్ హ్యాండ్సమ్ లుక్ లోకి మారాడు. దీనితో ఆయన మూవీ కన్మార్మ్ అని అభిమానులు ఖుష్ అవుతున్నారు. అసలు విషయం ఏమిటంటే మోక్షజ్ఞ- బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఆ సినిమాలో హీరోయిన్‌ని ఇప్పటికే ఫిక్స్ చేశారని తెలుస్తుంది.
మోక్షజ్ఞ కోసం బాలకృష్ణ రంగంలోకి దిగి మరి ఓ హీరోయిన్ ని సెలెక్ట్ చేశారట. ఆ హీరోయిన్ ఇప్పటికే టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉంది. టాలీవుడ్ మొత్తాన్ని తన కొనసాగులతో నడిపిస్తున్న ఆ హీరోయిన్ ఇప్పుడు మోక్షజ్ఞ పక్కన నటించటానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆ హీరోయిన్ మరి ఎవరో కాదు టాలీవుడ్ సెన్సేషన్ శ్రీ లీల. ఈమె మోక్షజ్ఞ హైట్ కు, వెయిట్ కు కరెక్ట్ గా సూట్ అవుతుందని .. ఈ నిర్ణయం తీసుకున్నారట బాలయ్య. ఇప్పటికే బాలయ్య తో భగవంత్ కేసరి సినిమాలో కూతురుగా నటిస్తున్న ఈమె బాలయ్య కొడుకుతో కూడా నటించడానికి రెడీ అయిపోతుంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి కొడుకు కోసం బాలయ్య భలే అమ్మాయిని లైన్ లో పెట్టాడు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు…!!