టాలీవుడ్లో నందమూరి కుటుంబం నుంచి మూడో తరం నట వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇన్నేళ్ల సినీ కెరీర్లో30కి పైగా సినిమాలు నటించిన తారక్ ఆయన కెరీర్లో నటించిన ఓ సినిమా మాత్రం ఇప్పటికీ విడుదల కావడం లేదు. అసలు విషయంలోకి వెళితే.. ఎన్టీఆర్ చిన్నతనంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణంలో రాముడిగా తన సినీ కెరీర్‌ను మొదలుపెట్టాడు. ఆ తర్వాత ‘నిన్నుచూడాలని’ సినిమాతో పూర్తిస్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఎన్టీఆర్‌కు నచ్చిన పాత్ర వస్తే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్ కు ప్రాణం పోస్తాడు. అంతే కాదు బాబాయ్ బాలకృష్ణలా యాక్షన్ సీన్స్‌లో తొడకట్టగలనని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే.. జూనియర్ ఎన్టీఆర్.. మొదటిసారి మొఖానికి రంగేసుకుంది సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’. ఈ సినిమాలో తారక్.. భరతుడి క్యారెక్టర్ చేసాడు.
తెలుగులో వచ్చిన బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమాలో బాలకృష్ణ హరిచంద్రుడుగా, దుష్యంతుడుగా నటించాడు. బాలీవుడ్ లో కూడా అవే క్యారెక్టర్ లో నటించడుు బాలయ్య. ఈ సినిమాలో దుష్యంతుడు కొడుకైన భరతుడుగా జూనియర్ ఎన్టీఆర్ నటించాడు. మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలో ఎన్టీఆర్ హిందీని అనర్గళంగా మాట్లాడం చూసి పెద్ద ఎన్టీఆర్ హిందీ వెర్షన్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ సినిమాలో ఎన్టీఆర్‌ను తీసుకున్నారు.
కానీ తెలుగులో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో హిందీ వెర్షన్‌కు సంబంధించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీటైన హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ చిత్రాన్ని అన్నగారు విడుదల చేయకుండా హోల్ట్‌లో పెట్టారు. ఆ తర్వాత పెద్ద ఎన్టీఆర్ రాజకీయాలతో బిజీ కావడం వంటి కొన్ని కారణాలతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది. ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే కాకుండా సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన ఈ సినిమా విడుదల కాకపోవడం విశేషం. ఈ రకంగా నందమూరి కుటుంబంలో ముగ్గురు హీరోలు నటించిన ఈ సినిమా విడుదల కాకపోవడం యాదృచ్ఛికమనే చెప్పాలి.