బుల్లితెర మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ సీరియల్స్ లోనే కాకుండా సినిమాలతో కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తనకంటూ ఓ స్టార్ డమ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ యాక్టర్ తన కొడుకుని హీరోగా పరిచయం చేయాలని ఎంతో తపనపడ్డారు. అందుకు అనుగుణంగా తన వంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఇదే సమయంలో ప్రభాకర్ కోడుకు చంద్రహాస్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే పెద్ద స్టార్ హీరో అయిపోయినట్లు ఫీల్ అవుతూ చంద్రహాస్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కి, ఆయన బిహేవియర్ ఈ ట్రోలింగ్ కి దారి తీసింది.
ఈ విషయం ఇలా ఉంచితే ఈ బుల్లితెర మెగాస్టార్ కొడుకు చేతిలో గతంలో రెండు మూడు సినిమాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలా చంద్రహాస్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని అందరూ అనుకున్నారు. ఇప్పటివరకు అతను చేస్తున్న సినిమాలు ఏంటి? అనే ఒక చిన్న అప్డేట్ కూడా బయటికి రాలేదు. ఈ తండ్రి కొడుకులు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వటం లేదు. అయితే చంద్రహాస్ సినీ కెరీర్ మొదటిలోనే ఆగిపోవడానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది.
అసలు విషయం ఏమిటంటే చంద్రహాస్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నెగటివ్ పబ్లిసిటీ ఏర్పడింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో వీడు హీరో ఏంట్రా బాబు..? అంటూ విపరీతమైన ట్రోలింగ్ కూడా జరుగుతూ వచ్చింది. వీటన్నిటిని తట్టుకుని చంద్రహాస్ని హీరోగా పెట్టుకుని సినిమా తీస్తే నిర్మాతలకు ఏమి మిగలదని వారు భావించారట. దర్శకులు కూడా అతనితో సినిమా చేసి దూల తీర్చుకోటం కన్నా.. పక్కకు జరగటం మంచిది అని భావిస్తున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. ఇక మరి ఈ యాటిట్యూడ్ స్టార్ సినిమా చేసి ప్రేక్షకులు ముందుకు వచ్చి మెప్పిస్తాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!!