స్క్రిప్టు లేకుండానే సినిమా … సావిత్రి ఆన్స‌ర్‌తో ప‌ట్ట‌రాని కోపంతో ఎన్టీఆర్ ఏం చేశారంటే..!

సాధార‌ణంగా అన్న‌గారు ఏసినిమా చేసినా.. ముందుగానే అన్ని ఏర్పాట్లూ చేసుకుంటారు. స్క్రిప్టు నుంచి క‌థ వ‌ర‌కు.. హీరో.. హీరోయిన్ల వ‌ర‌కు కూడా అన్ని ముందుగానే సిద్ధం చేసుకుంటారు. దీంతో అనుకున్న స‌మ‌యంలోనే సినిమాను పూర్తి చేసేవారు. అయితే.. దాన వీర శూర క‌ర్ణ సినిమా చేయాల‌ని అనుకున్న ప్పుడు.. అన్న‌గారు స్క్రిప్టును రెడీ చేసుకోలేదు. పైగా.. ఆయ‌న ఈ సినిమాను సొంత బ్యాన‌ర్‌పై చేస్తున్నారు.

ఇలా సొంత బ్యాన‌ర్‌పై సినిమా చేసే స‌మ‌యంలో అన్న‌గారు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉంటారు. కానీ, అప్ప‌ట్లో హీరో కృష్ణ క‌ర్ణ సినిమా చేస్తున్నార‌ని తెలియ‌డంతో అన్న‌గారు హ‌డావుడిగా త‌న సోద‌రుడు త్రివిక్ర‌మ‌రావుతో సినిమాను ప్ర‌క‌టించేశారు. మీడియా స‌మావేశం పెట్టిన త్రివిక్ర‌మరావు.. 41 రోజుల్లోనే అన్న‌గారు దాన‌వీర శూర‌క‌ర్ణ చేస్తున్నార‌ని చెప్పారు.

నిజానికి ప్ర‌క‌టించే స‌మ‌యానికి ద‌ర్శ‌కుడు కానీ, ఇత‌ర పాత్ర‌లు కానీ.. అస‌లు స్క్రిప్టు కానీ అన్న‌గారి చేతిలో లేవు. పైగా.. ఎవ‌రు హీరోయిన్ అనేది కూడా సందేహంగానే ఉంది. ఇదే విష‌యంపై అన్న‌గారిని మీడియా మిత్రులు ప్ర‌శ్నించారు. ఏమో బ్ర‌ద‌ర్ ప్ర‌క‌టించాం.. ఏం జ‌రుగుతుందో చూడాలి! అని వ్యాఖ్యానించారు. ఇక‌, హీరోయిన్ పాత్ర‌కు.. సావిత్రిని సంప్ర‌దించారు.

దీనికి ఆమె స్క్రిప్టు అయ్యాక పిల‌వండి.. అని తేల్చి చెప్పారు. దీంతో అన్న‌గారికి కోపం వ‌చ్చి.. అప్ప‌టి వ‌ర్ధ‌మాన న‌టి ప్ర‌భ‌ను హీరోయిన్‌గా ఎంచుకున్నారు. ఇక‌, తిరుప‌తి వెంక‌ట క‌వుల‌కు.. పాత్ర‌ల డైలాగులు రాసే బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ద‌ర్శ‌కుడు క‌మ‌లా కామేశ్వ‌ర‌రావును సంప్ర‌దిస్తే.. త‌న వ‌ల్ల‌కాద‌ని చేతులు ఎత్తేశారు.

దీంతో అన్నగారే జోక్యం చేసుకుని.. ఆయ‌నే సినిమాను పూర్తి చేశారు. ఇక‌, అక్కినేనిని అర్జ‌నుడిపాత్ర‌వేయాల‌ని కోరితే ఆయ‌న కూడా ఒప్పుకోలేదు. ఇలా.. అస‌లు సూత్రం లేని గాలిప‌టం మాదిరిగా ప్రారంభ‌మైన ఈ సినిమా.. అతి పెద్ద విజ‌యంన‌మోదు చేయ‌డం విశేషం.