చిత్ర పరిశ్రమకు హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. కానీ కొంతమంది మాత్రం ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దానికి పైగా కొనసాగుతూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే సరైన సినిమాలు ఎంచుకోక చిత్ర పరిశ్రమకు దూరమైపోతూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోయిన్లు ఉన్నారు.
ఇక ఈ విషయం పక్కన పెడితే ముందుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే మొదట్లో ఐరన్ లాగ్గా ముద్ర వేసుకుంది. కానీ ఆ తర్వాత స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ చేతిలో ఎప్పుడైతే పడిందో అప్పటినుంచి ఆమెకు వరుస విజయాలు వచ్చి గోల్డెన్ హీరోయిన్గా మారింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమాలు చేసుకుంటూ పూజా దూసుకుపోయింది.
ప్రస్తుతం పూజా హెగ్డే వరుస పరాజయాలతో ఆమె కెరీర్ క్లోజ్ అయ్యే దశలోకి వెళ్ళింది. ఈమే సినీ కెరీర్ ఏమైపోతుందో అనీ చాలామంది అభిమానులు ఆందోళన పడుతున్న సమయంలో మహేష్ బాబు సినిమా నుంచి ఈమెను తప్పించినట్లు అధికారికంగా వార్త బయటకు వచ్చింది. అంతేకాకుండా ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి చాలామంది దర్శక నిర్మాతలు కూడా భయపడుతున్నారు.
ఇప్పటికే తెలుగులో ఈమె సినీ కెరీర్ ముగిసింది అంటూ ఇండస్ట్రీలో టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇప్పుడూ పూజ హెగ్డే సినీ కెరీర్ ఇలాగే నాశనం అవ్వాలని ఓ స్టార్ హీరో మాత్రం తెగ ఆనందపడుతూ పూజలు చేస్తున్నాడట. ఎప్పుడైతే ఆమెకు అవకాశాలు రావట్లేదని ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తుందో అప్పటి నుంచి స్టార్ హీరో పార్టీ చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతున్నాడట.
ఆ స్టార్ హీరో అంతగా సంబరం చేసుకోవడానికి ముఖ్య కారణం పూజా హెగ్డే తలపొగరే అని తెలుస్తుంది. పూజా హెగ్డే గతంలో తన తల పొగరుతో మూడుసార్లు ఆ హీరో సినిమాలో అవకాశం వస్తే నేను నటించినంటూ మొహం మీదే చెప్పేసిందట. అప్పటి నుంచే ఆ హీరో ఈమె కెరీర్ ఎప్పుడు క్లోజ్ అవుతుందా.. అంటూ ఎదురు చూసి ఇప్పుడు ఆమెకు అవకాశాలు రావడం లేదని తెలిసి తెగ సంబరపడిపోతున్నాడట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.