బయటకు ఎంతో పద్ధతిగా ఉండే సాయి పల్లవికి.. అలాంటి బ్యాడ్ హ్యాబిట్ ఉందా..!

చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా వాళ్ళందరిలోకి ఎంతో స్పెషల్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.. ఏ సినిమాలో అయినా సరే తన కంఫర్ట్ తాను చూసుకుంటు తన రూల్స్ బ్రేక్ చేయకుండా తన హద్దులు మీరకుండా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇప్పటివరకు ఈ న్యాచురల్ బ్యూటీ ఎన్నో సినిమాల్లో నటించింది. చాలా సినిమాలు హిట్ అయ్యాయి. మరికొన్ని సినిమాలు ప్లాప్‌ అయ్యాయి.

అయినా సరే ఎక్కడ సాయి పల్లవి పై నెగటివ్ మార్క్ రాలేదు. అందుకు ముఖ్య కారణం ఆమెలో ఉన్న మంచితనమే.. త‌న‌తో సినిమాలు చేసిన నిర్మాత‌ల సినిమాలు ప్లాప్ అయితే రెమ్యున‌రేష‌న్లో కూడా కొంత వెన‌క్కు ఇచ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇంత మంచిగా ఉండే సాయి పల్లవికి కూడా కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

ఆ చెడు అల‌వాట్లు ఏంటంటే బయటకు ఎంతో పద్ధతిగా, సింపుల్ గా కనిపించే సాయి పల్లవికి ఓ బాడ్ హ్యాబిట్ ఉందంట‌. ఈమెకు విపరీతమైన కోపం అట‌. ఏ విషయంలో అయినా సరే కోపం వస్తే ఎలా ? రియాక్ట్‌ అవుతుందో ఈమెకే తెలియదు. అంతేకాకుండా తన పక్కన ఎంత పెద్ద వస్తువున్నా సరే దాన్ని ముక్కలు ముక్కలు చేసి తర్వాత తన తప్పును తెలుసుకొని బాధపడుతూ ఉంటుందట.

ఇదే విషయాన్ని సాయి పల్లవి గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా పంచుకుంది. దీంతో సోషల్ మీడియాలో సాయి పల్లవికి కోపం వస్తే రాక్షసిలా మారిపోతుందా..? అంటూ నేటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అదేవిధంగా ఆమెకు కోపం తెప్పించ‌కుండా ఉంటే చాలా మంచిది అంటూ సిల్లీ సజెషన్స్ ఇస్తున్నారు.