టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. గతేడాది మేలో వచ్చిన సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని మరీ గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మీనాక్షి చౌదరిని కూడా పూజా హెగ్డే ప్లేసులో తీసుకున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా మహేష్‌బాబు షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను పిచ్చగా షేక్ చేసి పడేస్తోంది. మహేష్ బాబు జిమ్‌లో బాగా వర్కవుట్లు చేస్తున్నాడు. ఈ వర్కవుట్ల వీడియో ఇప్పుడు ఇన్ స్టాలో బాగా దూసుకు పోతోంది. అలాగే జిమ్ లో తన ఫేవరెట్ మూడు వర్కవుట్లు ఇవేనంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు.
మై సాటర్ డే సిజిల్ సెట్ అంటూ ఒక నిమిషం ల్యాండ్ మైన్ ప్రెస్, ఒక నిమిషం కెటిల్‌బెల్ స్వింగ్, ఒక నిమిషం స్కిల్ మిల్ రన్ మీరు ఎన్ని సెట్లు చేయగలరు ? అంటూ మహేష్ ఛాలెంజ్ విసిరాడు. ఇది చూసిన మహేష్ సతీమణి నమత్రా శిరోద్కర్ ఫైర్ ఎమోజీలతో కామెంట్ చేసింది. ఇది చూసిన మహేష్ ఫ్యాన్స్ మాత్రం మరో పోకిరి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వర్కవుట్లు వీడియో అయితే మాత్రం సోషల్ మీడియాను పిచ్చ పిచ్చగా షేక్ చేస్తోంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
View this post on Instagram