టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీబ్యూటీ తమన్నా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అవుతున్నా కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతూ కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. అటు వెండి తెరతో పాటు ఇటు బుల్లితెరపై వెబ్ సీరిస్‌ల్లో నటిస్తూ దూసుకు పోతోంది. మూడున్నర పదుల వయస్సుకు చేరువ అయినా కూడా తమన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ వయస్సులోనూ రెమ్యునరేషన్ విషయంలో ఆమె ఏ మాత్రం తగ్గడం లేదు.
నా దగ్గర బేరాలు లేవమ్మా అంటూ తాను అనుకున్న, అడిగిన రెమ్యునరేషన్ ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటోంది. దీనికి తోడు టాలీవుడ్‌లో సీనియర్ హీరోలకు సరైన జోడీ హీరోయిన్లు లేకపోవడంతో నిర్మాతలు కూడా ఆమె అడిగినంత సమర్పించు కోక తప్పని పరిస్థితి. ఇక బాలీవుడ్‌లో ఆమె మొదటిగా జీ కర్ద అనే వెబ్ సీరిస్‌లో నటించింది.
ఇప్పుడు లస్ట్‌స్టోరీస్ సీరిస్ లో కూడా నటించింది. అందాల ఆరబోత విషయంలో ఆమె రెచ్చిపోచి మరీ చూపించేసింది. బాగా డోస్ పెంచేసింది. ఆమె కెరీర్‌లో ఎప్పుడూ కూడా ఇంత దారుణమైన సీన్లలో నటించలేదు. మరోవైపు బాలీవుడ్ నటుడు విజయ్‌వర్మతో ప్రేమలో ఉన్నానని కూడా ప్రకటించి సెన్షేషనల్ అయ్యింది. ఈ సీరిస్‌లో తమన్నా ప్రియుడు విజయ్‌వర్మతో మూతిముద్దులతో పాటు పడకగది సీన్లతో రెచ్చిపోయారు.
ఈ సీరిస్‌లో నటించినందుకు గాను తమన్నాకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తమన్నా మామూలుగా ఒక్కో సినిమాకు రు. 3 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటోంది. అదే లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సీరిస్‌లో కేవలం 30 నిమిషాల పాత్రలో నటించేందుకు గాను ఆమెకు మేకర్స్ ఏకంగా రు. 7 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఆ సీన్లలో నటించేందుకు ఎలాంటి అడ్డు చెప్పకపోవడంతోనే తమన్నాకు ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు మేకర్స్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా తమన్నా 30 నిమిషాలకు అంత రేటు తీసుకుందంటే ఆమె నిజంగానే నక్క తోక తోక్కినట్టే అనుకోవాలి.