న‌ట‌సింహం ఫ్యాన్స్‌కు పూన‌కాల్లాంటి న్యూస్‌… ‘ బాల‌య్య – బాబి ‘ సినిమా రిలీజ్ అప్పుడే… !

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భగవంత్‌ కేసరి సినిమా ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా మరో హీరోయిన్ శ్రీలీల‌ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.

ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య వాల్తేరు వీర‌య్య‌ సూపర్ హిట్ కొట్టిన యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాబీ కూడా మాస్ సినిమాలు తెరకెక్కించటంలో మంచి దిట్ట. వాల్తేరు వీర‌య్య‌ సినిమాలో చిరంజీవిని ఊర మాస్ పాత్రలో చూపించి మరీ హిట్ కొట్టాడు.

ఈ క్రమంలోనే బాలయ్యతో కూడా ఓ అదిరిపోయే మాస్ మసాలా ఎలిమెంట్స్ తో సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీపై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. వ‌చ్చే యేడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాలయ్య సినిమా వస్తే అది కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మంచి ఊపు వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మార్చి ఫస్ట్ వీక్ లో ఈ సినిమా రిలీజ్ చేసేలా షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు అట. 2014 ఎన్నికలకు ముందు బాలయ్య హీరోగా వచ్చిన లెజెండ్ సినిమా కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్‌కు ఎలాంటి ఊపు తెచ్చిందో చూసాం. ఇప్పుడు బాబీ సినిమాను కూడా ఎన్నికలకు ముందు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.