అదే నిజమైతే చరణ్‌కి భారీ డిజాస్టర్.. ఎన్టీఆర్‌కి పెద్ద రిలీఫ్..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఒకసారి వైరల్ గా మారింది. దానికి ప్రధాన కారణం రామ్ చరణ్ రీసెంట్ గానే తండ్రిగా ప్రమోట్ అయ్యాడు. అంతేకాకుండా నిన్న రామ్ చరణ్ కూతురుకు పేరు కూడా పెట్టారు. ఇదే సమయంలో రామ్ చరణ్ కి బిడ్డ పుట్టిన అపోలో హాస్పటల్ దగ్గర మీడియా వాళ్ళు ఎంత హంగామా చేశారు అందరికీ తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్ కుమార్తె పేరు కూడా క్రీంకార్య అని పెట్ట‌డంతో బాగా వైర‌ల్ అయ్యింది.

ఇక రామ్‌చ‌ర‌ణ్ తర్వాత నటిస్తున్న సినిమాపై ఊహించిన విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ట్యాగ్ చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజెర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే చరణ్ మరో సినిమా కమిట్ అయ్యాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంద‌ని టాక్ ?

త్వరలోనే షూటింగ్ మొదల‌వుతున్న ఆ సినిమా ఒకవేళ ప్లాప్‌ అయితే చరణ్ కి భారీ దెబ్బ పడుతుంది అంటున్నారు నెటిజన్లు. రామ్ చరణ్ ఎప్పటికే రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో మగధీర, త్రిబుల్ ఆర్ సినిమాల్లో నటించారు. రాజమౌళితో సినిమా చేసిన‌ తర్వాత ఏ హీరో కైనా భారీ డిజాస్టర్ తప్పదు. ఈ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయితే రామ్ చరణ్, శంకర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం ఖాయం.

ఆ తర్వాత బుచ్చిబాబు సానాతో చేసే రామ్ చరణ్ సినిమా కూడా బోల్తా కొట్టింది అంటే పాన్ ఇండియా హీరో కాస్త డిజాస్టర్ హీరోగా మారే ప్ర‌మాదం ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో బుచ్చిబాబు సానాతో రామ్ చరణ్ చేసే కథను ముందుగా అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోలు రిజెక్ట్ చేశారు.

ఆ తర్వాత బుచ్చిబాబు రామ్ చరణ్‌కు ఆ కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. ఏదేమైనా బుచ్చిబాబు సినిమా ఒక వేళ ప్లాప్ అయినా అయితే అప్పుడు ఎన్టీఆర్, బ‌న్నీ జ‌డ్జ్‌మెంట్ క‌రెక్ట్ అవుతుంద‌ని.. ఒక‌వేళ హిట్ కొడితే చెర్రీ డెసిష‌నే రైట్ అవుతుంద‌ని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు.